మట్టి మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టిమనుషులు చిత్రం తెంగాణ గ్రామీణ వలస కార్మికుల జీవితాలకు అద్దం పట్టేదిగా నిలిచింది. కె.ముఖర్జీ, [[మణికొండ వేదకుమార్|మణికొండ వేదకుమార్‌]] నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నాటి సామాజిక విలువలను చాటేదిగా ఉంది. అర్చన, మోహిన్‌ అలీ బేగ్‌, [[నీనా గుప్తా]] తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.కె.బీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. కార్మికులు ప్రధానంగా భవన నిర్మాణ కూలీల జీవితాలు ప్రధాన కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ అవార్డును అందుకుంది<ref name="38thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/38th_nff_1991.pdf|title=38th National Film Awards|format=PDF|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=9 January 2012}}</ref><ref>{{cite web|url=http://news.webindia123.com/news/articles/India/20081221/1134082.html |title=Telugu creative genius Narsingh Rao's films regale Delhi |publisher=News.webindia123.com |date=2008-12-21 |accessdate=2012-08-27}}</ref>. 1990లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శితమైంది<ref>http://iffi.nic.in/Dff2011/FrmIP1990Award.aspx?PdfName=IP1990.pdf</ref>.
 
పల్లె నుంచి పట్టణాలకు వలసలు, వడ్డీవ్యాపారులు, కార్మికులు, మధ్యవర్తులు, భవన నిర్మాణ రంగంలో ప్రమాదాలు, మహిళ వ్యథలు, సాయం పేరుతో చేసే మోసాలు...ఇలా జీవితాల్లోని ఎన్నో అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కమర్షియల్‌ సినిమాకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది.
"https://te.wikipedia.org/wiki/మట్టి_మనుషులు" నుండి వెలికితీశారు