చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: {{commons category|C. N. R. Rao}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
'''సి.ఎన్.ఆర్.రావు'''గా ప్రసిద్ధిచెందిన '''చింతామణి నాగేశ రామచంద్ర రావు''' ([[జూన్ 30]], [[1934]]) ప్రముఖ భారతీయ [[శాస్త్రవేత్త]]. [[భారతరత్న]] పురస్కార గ్రహీత.
 
[[భారత రత్న]] ప్రొఫెసర్‌ '''చింతామణి నాగేశ రామచంద్రరావూ''' (సీఎన్‌ఆర్‌ రావు), (కన్నడభాష :ಚಿಂತಾಮಣಿ ನಾಗೇಶ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ) రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. [[సి.వి.రామన్]]‌, మాజీ రాష్ట్రపతి [[అబ్దుల్‌ కలాం]]ల తరువాత భారతరత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త.
 
1934 జూన్‌ 30న బెంగళూరులో జన్మించారు. తండ్రి హనుమంత నాగేశరావు, తల్లి నాగమ్మ. 1951లో [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుంచి ఆయన బీ.ఎస్సీ. పూర్తిచేశారు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] లో ఎమ్మెస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి 1958లో పీ.హెచ్.‌డీ. అందుకున్నారు. [[బెంగళూరు]]లోని [[ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్]]‌లో లెక్చరర్ ‌గా చేరారు. 1963లో కాన్పూర్‌ ఐఐటీలో అధ్యాపకుడిగా చేరారు. నానో పదార్థాల రంగంలో రావు విశేష కృషి చేశారు. 1400 పరిశోధన పత్రాలను వెలువరించారు. 45 పుస్తకాలు ప్రచురించారు. [[పద్మశ్రీ]], [[పద్మ విభూషణ్]]‌, కర్ణాటక అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న పురస్కారాలను అందుకున్నారు. 2000 సంవత్సరంలో రాయల్‌ సొసైటీ ఆయనకు హ్యూగ్స్‌ మెడల్‌ను అందించింది.
2005 నుంచి ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలికి అధిపతిగా ఉన్నారు. ఆయన 1963 నుంచి 1976 వరకూ కాన్పూర్‌ ఐఐటీలో డీన్‌గా వ్యవహరించారు. 1984 నుంచి పదేళ్ల పాటు ఐఐఎస్‌సీకి సంచాలకులుగా పనిచేశారు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగానికి, పదార్థ పరిశోధన ప్రయోగశాలకు వ్యవస్థాపక ఛైర్మన్‌. బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌కు ఆయన వ్యవస్థాపకుడు. సీ.ఎన్.‌ఆర్‌ రావుపై గ్రంథచౌర్యం ఆరోపణలు కూడా వచ్చాయి. తన పరిశోధన పత్రంలో ఇతర శాస్త్రవేత్తల పత్రాల్లోని వ్యాక్యాలను ఎత్తిరాసినందుకు 'అడ్వాన్స్డ్‌ మెటీరియల్స్‌' అనే పత్రికకు క్షమాపణ చెప్పారు.
 
==మూలాలు==
{{Reflist|35em}}
 
*ఈనాడు 17.11.2013 http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=7
 
[[వర్గం:భారతీయ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
 
 
==బాల్యం==