"రుక్మిణీ" కూర్పుల మధ్య తేడాలు

చి
ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలొ అనేక రాజ్యాల రాజులు ఉన్నారు.అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలు దేరతాడు. అలా రుక్మిణీ దేవిని తిసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు.తేరుకొని శ్రీ కృష్ణుడి మీద యుద్ధమునకు బయలు దేరారు.అప్పుడు [[బలరాముడు]] మొదలైన యదు వీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆరాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య ,ఇప్పుడూ ఇంటికి వెళ్ళి మరో రాచ కన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేన తో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సు ఖండించాడు. మరికొని నిశిత శరాలతో గుఱ్ఱలను చంపాడు. శిశుపాలుడు పరిగ , గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేధించాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళపై అపొఅడీ తన సోదరుడిని క్షమించి విడిచి పెట్ట మంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మి కి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా [[బలరాముడు]] రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.
 
==శ్రీ కృష్ణుడు - రుక్మిణీ తొ ఛలోక్తాడిన సన్నివేశం==
==శ్రీ కృష్ణశ్రీకృష్ణ తులాభారం==
 
 
==బయటి లింకులు==
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/186113" నుండి వెలికితీశారు