"ధూమరేఖ" కూర్పుల మధ్య తేడాలు

3,256 bytes added ,  4 సంవత్సరాల క్రితం
'''ధూమరేఖ''' [[పురాణవైర గ్రంథమాల]] నవలల సీరీస్లో మూడవది. భారతీయుల పురాణాల్లోని చరిత్రాంశాలు వాస్తవమైనవంటూ, వాటిని మన చరిత్ర రచనకు ప్రామాణికంగా గ్రహించకపోవడం వల్ల ఎన్నో అంశాలు తెలియకుండా పోయాయన్నది ఈ నవలామంజరిలో విశ్వనాథ సత్యనారాయణ వాదం. నవలలోని కథాంశాలకు క్రమంగా కలియుగం ముగిశాకా పురాణాల ప్రకారం ఏర్పడ్డ రాజవంశాలను గుదిగుచ్చుతూ నేపథ్యం ఏర్పరుచుకున్నారు. ఇతివృత్తాల్లో కూడా భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని నాశనం చేద్దామని భావించిన మ్లేచ్ఛులు ఒక్కో నవల్లోనూ ప్రయత్నిస్తూండం కథా సూత్రంగా కొనసాగుతుంది.
== కథ ==
మగధ వంశం ప్రద్యోత వంశం చేతిలో ఉన్నప్పటి నేపథ్యం పురాణ వైర గ్రంథమాలలోని రెండవ నవలలో వస్తుంది. మూడవ నవలైన ధూమరేఖలో శిశునాగ వంశం వారు రాజ్యం చేస్తున్నప్పటి నేపథ్యం. శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు పురుష సంతానం లేదు. ఒక్కతే కూతురు. ఆమె పేరు వేదమరీచి. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. తల్లి దుఃఖమును మరచిపోవడానికి కాశీరాజు ఆమెని కాశీ నగరానికి తీసుకెళ్ళాడు. అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది, మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.
 
భారతదేశాన్ని మ్లేచ్ఛమయం చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్న జయద్రథులనే పరంపరలోని ఒక జయద్రథుడు (మొదటి నవల భగవంతుని మీది పగలో ఈ విషయం చెప్తారు) తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. పుట్టుకతోనే శిశునాగునిలో అధర్మమైన సంస్కారం వుంది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు కాశీనగరం లోనే వుండి, అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూంటుంది. భార్యని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోకపోవడంతో వేదమరీచి తమ మహారాణి అనీ, ఆమె మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861218" నుండి వెలికితీశారు