వై.రుక్మిణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వై.రుక్మిణి''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు [[వై.వి.రావు]] భార్య. ఈమె తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించినది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు లక్ష్మీ కూడా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటించినది.
 
రుక్మిణి 4 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర చిత్రముద్వారా సినీరంగములో బాలనటిగా అడుగుపెట్టి 40కి పైగా సినిమాలలో బాలనటిగా పనిచేసినది. రుక్మిణి కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏవియం పతాకంపై టి.ఆర్.మహాలింగం తీసిన శ్రీవల్లి. రుక్మిణి తల్లి నుంగంబాక్కం జానకి, తొలి తరం తమిళ సినిమా నటి మరియు నర్తకి.
 
ఈమె నటించిన తమిళ చిత్రాలలో ''వెన్నిరాదై'', ''కప్పలొతీయ తమిళన్'', ''రోజావిన్ రాజా'', ''మనియొసై'' మరియు ''ఇదయకమలమ్'' కొన్ని ప్రముఖమైన చిత్రాలు. తెలుగు సినిమా రంగములో ఈమె [[ఎన్టీ రామారావు]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]]లు ఇరువురితో కలిసి నటించినది. హిందీలో ఈమె కొన్ని చిత్రాలలో నటించడమే కానీ కొన్ని చిత్రాలను నిర్మించినది కూడా. హిందీలో రుక్మిణి నిర్మించిన సినిమాలలో ''లవంగి'' మరియు ''మంజరి'' సినిమాలు చెప్పుకోదగినవి.
"https://te.wikipedia.org/wiki/వై.రుక్మిణి" నుండి వెలికితీశారు