"ధూమరేఖ" కూర్పుల మధ్య తేడాలు

138 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
మగధ వంశం ప్రద్యోత వంశం చేతిలో ఉన్నప్పటి నేపథ్యం పురాణ వైర గ్రంథమాలలోని రెండవ నవలలో వస్తుంది. మూడవ నవలైన ధూమరేఖలో శిశునాగ వంశం చేతిలోకి రాజ్యం వెళ్తున్న సంధికాలంలోది. శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు వేదమరీచి ఒక్కతే కూతురు. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. కాశీరాజు ఆమెని తల్లి లేని లోటు లేకుండా పెంచేందుకు కాశీ నగరానికి తీసుకెళ్ళాడు. అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది, మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.
 
భారతదేశాన్ని మ్లేచ్ఛమయం చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్న జయద్రథులనే పరంపరలోని ఒక జయద్రథుడు (మొదటి నవల భగవంతుని మీది పగలో ఈ విషయం చెప్తారు) తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. పుట్టుకతోనే శిశునాగునిలో అధర్మమైన సంస్కారం వుంది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు కాశీనగరం లోనే వుండి, అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూంటుంది. భార్యని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోకపోవడంతో వేదమరీచి మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు. దీంతో మగధ రాజ్య మంత్రులలో వృద్ధులైన ఇద్దరు బతిమాలి, బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు.
 
శిశునాగునికి వేదమరీచి రాజ్యం చేపట్టేందుకు వెళ్ళడం ఇష్టం ఉండదు, ఆమె వెళ్ళిపోయాక శిశునాగుడు బాధతో, కోపంతో ఆ రాత్రి కాలినడకన ఎటు వెళ్తున్నాడో గమనించుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్తాడు. అక్కడ ఒక కర్ర లోనుంచి వస్తూన్న పొగని గొట్టంతో పీలుస్తూన్న పిశాచంలాంటి మనిషిని చూస్తాడు. శిశునాగుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితుడై ‘నేను నీదగ్గరే వుండి పోతాను’ అంటాడు. అతను ‘వద్దు, నువ్వు కోటకి వెళ్ళు. నేనే నిన్ను చూడటానికి కోటకి వస్తాను. నువ్వు వుండమంటే అక్కడే వుండిపోతాను.’ అంటూ శిశునాగుడి చేత ‘నేను నీ శిష్యుడిని’ అనిపిస్తాడు. తన చేతిలో వున్న కట్టెని శిశునాగుడికి యిచ్చి అతని చేత కూడా ధూమపానం చేయిస్తాడు. ఆ ధూమపానం చేయగానే శిశునాగుడిలో మార్పు వస్తుంది. వేదమరీచితో తనకున్న సంబంధం సహజమైనదేనని, తప్పుకాదని అనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861231" నుండి వెలికితీశారు