"ధూమరేఖ" కూర్పుల మధ్య తేడాలు

374 bytes added ,  4 సంవత్సరాల క్రితం
== పాత్రలు ==
* '''శిశునాగుడు''': శిశునాగుడు కాశీరాజు కుమారుడు, మగధను పాలిస్తున్న నందివర్ధనుడికి పినతల్లి కుమారుడు. అతనికి జన్మగతంగా వచ్చిన సంస్కారంలోనే ఒక అధర్మం ఉంటుంది. తన అన్నగారి కుమార్తె అయిన వేదమరీచినితో యవ్వనంలో సంబంధం ఏర్పరుచుకోవడం. ఆపైన ఆమె రాజ్యం చేయడానికి వెళ్ళిపోవడం తర్వాత బాధలో శ్మశానంలోని పిశాచరూపుడైన వాణ్ణి గురువుగా స్వీకరించడం. అతను భస్మమైపోయిన జయద్రథుని ధూమాన్ని పీల్చి పూర్తిగా అధర్మపరుడు, పిశాచావేశ నిష్టుడు కావడం జరుగుతుంది. ఇదంతటికీ మూలంలో అతని సంస్కారం, లక్షణం అధర్మపరమైనవి కావడం వల్ల తేలికగా లోబడతాడు.<ref name="పుస్తకం.నెట్లో ధూమరేఖ గురించి" /> నవలలో ఈ పాత్రను దాదాపుగా ప్రతినాయక పాత్రగా తీర్చిదిద్దారు.
* '''వంకజాబిల్లి''': వంకజాబిల్లి శిశునాగుని భార్య, ఆంధ్ర రాకుమార్తె. గొప్ప సౌందర్యవతి, స్వతంత్రమైన వ్యక్తిత్వం, వివేకం కలిగినది. రాజ్యం పాలించడమే కాక రాజ్యాన్ని విస్తరించగల సమర్థత కూడా ఉన్న మనిషి. పరాశరశాస్త్రి అన్న మంత్రవేత్త ప్రకారం ఈమెలోని జీవుడు కొంత ఉన్నతమైనవాడు, స్వచ్ఛత కలిగినవాడు. ఐతే ఆమె నిద్రిస్తున్నప్పుడు నాస్తిక ధూమాన్ని జయద్రథుడు ప్రవేశింపజేస్తాడు. దాంతో ఆమె మందగిస్తుంది. జయద్రథుడే ఆమె తండ్రిని ఒప్పించి శిశునాగుడితో ఆమె వివాహం అయ్యేలా చేస్తాడు. భర్త కోరిన కోరిక తీర్చేందుకు సామోపాయంతో మగధలోకి ప్రవేశించి మగధ రాణిని చంపించి, ఆ నేరాన్ని ఆమె భర్తపై వేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్న రాజకీయవేత్త. అంతేకాక ధూమరేఖా ప్రభావంతో పీడితురాలైన కుక్క తుదకు జయద్రధుని, జయద్రథుడు ఆ కుక్కని చంపేలా చేసి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకున్న దూరదృష్టి ఆమె స్వంతం. అయితే ఆమె పాత్ర ఉదాత్తత <ref name="విశ్వనాథ కథలలో">{{cite book|last1=దిట్టకవి|first1=శ్యామలాదేవి|title=విశ్వనాథ కథలలో|page=76|url=http://syamasahithi.com/thesis/76.htm|accessdate=30 March 2016|chapter=వంక జాబిల్లి}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861266" నుండి వెలికితీశారు