యునానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యునానీ''' (Unani) అన్న మాట "అయోనియా" అన్న [[గ్రీకు]] మాట లోంచి వచ్చింది. అయోనియా గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు [[హకీమ్ బిన్ సేనా]]. [[హకీం]] అంటేనే [[వైద్యుడు]]. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ [[భారతదేశం]] లో బహుళ ప్రచారంలో ఉంది.
 
{{వైద్య శాస్త్రం}}
 
ఈ వైద్యం [[హిపోక్రటీస్]] ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం.ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం(yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, గాలి)చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ [[ఇస్లాం]]కీ ఉంది.
 
యునానీ మందులని [[తేనె]]తో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన [[ముత్యాలు]], [[బంగారం]] కూడ యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/యునానీ" నుండి వెలికితీశారు