యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఉదయం నుండియే ఆలయంలో స్వామివారికి అఖండ దీపారాధన, అభిషేకం, కుంకుమర్చన, ఊరేగింపు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవానికి గ్రామస్తులు, చుట్టు ప్రక్కల గ్రామాలనుండియే గాక, భక్తులు, జిల్లా నలుమూలలనుండి తరలివచ్చి, స్వామివారిని దర్సించుకుని పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఎడ్లబండ్లకు ప్రత్యేక అలంకరణలు, ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించెదరు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో పశువులను తోలుకొనివచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఇక్కడి ప్రత్యేకం. [2],[3]&[7]
#ఈ ఆలయానికి ఒక భక్తుడు ఒక కంచు గంటను సమర్పించినాడు. ఈ గంట ఒకసారి కొడితే, 30 సార్లు ఓంకారనాదం శబ్దాలు వెలువడుతవి. [3]
====నాగేంద్రుని పుట్ట====
ఈ ఆలయం ఎదురుగా నాగేంద్రుని పుట్ట ఉన్నది. యార్లగడ్డ గ్రామములో నాగేంద్రుని నివాసం, '''దేవుని పుట్ట ''' గా పేరొంది, గొప్ప పుణ్యక్షేత్రమై, కృష్ణా జిల్లాలో ప్రాశస్తమైనది. నాగులచవితి పర్వదినాన ఈ పుట్టలో పాలుపోసి, నివేదనలు సమర్పించిన యెడల, సకల కోరికలు సిద్ధించునని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రిని పురస్కరించుకుని, భక్తులు నాగేంద్రస్వామికి పూజలు నిర్వహించెదరు. [2]&[7]
 
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు