నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

నేను మెయిలు ద్వారా శివన్నారాయణ గారిని సంప్రదించి చేర్చిన వివరాలు
పంక్తి 1:
'''నారిపెద్ది శివన్నారాయణ''' ఒక ప్రముఖ తెలుగు నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు <ref>{{cite web|url=http://www.maastars.com/sivannarayana/|title=Sivannarayana|work=MaaStars}}</ref>
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన ప్రకాశం జిల్లా, తూళ్ళూరు మండలం, శివరామ పురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయిలో నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.
 
== వృత్తి, ప్రవృత్తి ==
చదువు పూర్తయిన తరువాత బి.ఎస్.ఎన్.ఎల్ లో కొద్దికాలం అధికారిగా పనిచేశాడు. ఉద్యోగరీత్యా తెలంగాణాలోని సంగారెడ్డి, సికింద్రాబాద్ లో పనిచేస్తున్నపుడు వివిధ రంగస్థల సమూహాలతో నాటకాలలో మంచి వేషాలు వేస్తూ వచ్చాడు. తరువాత నటన మీద ప్రేమతో ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ నాటకోల కోసం కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నాడు.