హోల్మియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ రసాయన మూలకానికి స్వీడన్ దేశపు ముఖ్యపట్టణం అయిన స్టాక్‌హోమ్‌ (Stockholm) పేరు పెట్టేరు. స్టాక్‌హోమ్‌ (Stockholm) లో L ఉచ్చరించము; అలాగే Holmium లో L అనుచ్చరితం. కనుక ఈ మూలకాన్ని తెలుగులో "హోమియం" అని పలకాలి. కాని హోల్మియం అన్నా పరవాలేదు. (Holmium is pronounced as HOHL-mee-em.)
 
ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్‌) లో హోమియం స్థానం 6 వ గుంపు (నిరుస) లో లేంథనైడ్ వరుసలో వచ్చే విరళ మృత్తిక మూలకాల ("రేర్‌ ఎర్త్" జాతి) కోవలో కనిపిస్తుంది. ఈ మూలకం అణు సంఖ్య 67. అణు భారం 164.930. రసాయన హ్రస్వ నామం: Ho. విరళ మృత్తిక మూలకాలు అన్నీ అరుదు కావు కానీ, ఈ మూలకం మాత్రం అరుదే. దీని అణు సంఖ్య బేసి సంఖ్య కావడం వల్ల ఆడో-హార్కింస్ (Oddo-Harkins) నియమానుసారం దీని లభ్యత సరి సంఖ్య అణు సంఖ్యగా ఉన్న మూలకాలతో పోల్చి చూస్తే దీని లభ్యత అరుదే. అయినా సరే మిగిలిన విరళ మృత్తిక మూలకాలతో పోల్చి చూస్తే ఈ మూలకం చవగ్గానే దొరుకుతోంది. సా. శ. 2016 లో దీని వెల కిలోగ్రాముకి సుమారు 1000 అమెరికా డాలర్లు.
 
ఈ మూలకం మోనజైట్, గేడొలినైట్ అనే ఖనిజాలలో దొరుకుతుంది. కేరళ్ లో ఉన్న సముద్ర తీరపు ఇసకలో ఈ మోనజైట్ సమృద్ధిగా దొరుకుతోంది.
 
ప్రస్తుతం ఈ మూలకానికి తక్కువఎక్కువ ఉపయోగాలు కనిపిస్తున్నాయికనిపించడం లేదు. తక్కువ ఉష్ణోగ్రత దగ్గర హోల్మియం స్పుటంగా అయస్కాంత లక్షణాలు ప్రదశిస్తుంది కనుక ఎక్కువ పటిమ గల ప్రత్యేకమైన అయస్కాంతపు కడ్డీల తయారీలో ఇది ఉపయోగపడుతోంది. వైద్య పరికరాలలో వాడే లేసర్లు తయారీలో కూడ దీనికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉంది. ఈ లేసర్లు ఉరమరగా 2 మైక్రోమీటర్లు ( 2 x 10<sup>-6</sup> మీటర్లు ) పొడుగున్న కాంతి తరంగాలని పుట్టిస్తాయి. శరీరంలో ఉన్న కణజాలంలో ఉన్న నీళ్లు ఈ తరంగాలని సమర్ధవంతంగా పీల్చుకుంటాయి. అందుకని ఈ రకం లేసరుతో కోసినప్పుడు కోత, చిరుగులు లేకుండా, సీదాగా వస్తుంది. అంతే కాకుండా శస్త్రం చేస్తూన్నప్పుడు తెగిన రక్తనాళాలు వాటంతట అవి మూసుకుపోతాయి (self-cauterizing) కనుక రక్త స్రావం జరిగిపోదు.
 
బోరాన్ లాగే హోల్మియం కూడా నూట్రానులని సమర్ధవంతంగా పీల్చుకుంటుంది కనుక అణువిచ్ఛిత్తి జరిగే సందర్భాలలో దీనిని moderator గా ఉపయోగిస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హోల్మియం" నుండి వెలికితీశారు