అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== ఇతివృత్తం ==
పుట్టుకతో మాటలు రాని, వినిపించని కిష్టయ్య (అనంత్ నాగ్) కుమ్మరి. అతని భార్య లక్ష్మి ([[షబానా అజ్మీ]]) ఊరి కామందు దగ్గర పనిచేస్తూంటుంది. కుండలు, ఇతర వస్తువులు మట్టితో తయారుచేసి అమ్ముకునే అతనికి అల్యూమినియం పాత్రలు మార్కెట్లోకి రావడంతో పని పోయింది. చేసే వృత్తి పాడైపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను సరిజేసుకునేందుకు తన యజమానికి చెప్పి అతని వద్ద బండితోలే పనిలో పెడుతుంది లక్ష్మి. అప్పటికే తాగుబోతుగా తయారు కావడంతో రాబడికి మించి తాగుతూ, చివరకి కల్లు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు కిష్టయ్య. దొంగతనం చేసినందుకు తల గొరిగి వదిలిపెట్టడంతో, ఆ అవమానంతో ఊళ్ళో తిరగలేక కిష్టయ్య ఊరొదిలి పారిపోతాడు.<br />
భర్త వదిలిపెట్టిన స్త్రీ కావడం, అమాయకురాలు కావడం, వెనుకబడ్డ వర్గానికి చెందివుండడం వంటి కారణాలతో నిస్సహాయురాలైన లక్ష్మిని లొంగదీసుకుంటాడు. అతని వల్ల గర్భం రావడంతో తన మర్యాదకు భంగమౌతుందని భయపడి తీయించుకోమని బెదిరిస్తాడు. ఐతే ఆమె కడుపుతీపితో ఆ పనిచేయడానికి వ్యతిరేకించడంతో కోపగించుకుంటాడు. యజమాని భార్య కాపురానికి రావడంతో లక్ష్మిపై దొంగతనం నేరం మోపి పనిలోంచి తీసేస్తాడు. నిండు గర్భంతో ఉన్న లక్ష్మి తిండి, ఆలనా పాలనా చూసుకునే తోడు లేక ఒంటరిగా మిగిలిపోతుంది.<br />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు