భారతీయ రైల్వేలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
→‎చరిత్ర: అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 39:
[[File:Mumbai Train.JPG|thumb|ముంబై లోకల్ రైలు]]
[[Image:Darjeeling Himalayan Railway.jpg|thumb]]
భారత దేశంలో రైలు మార్గాల కొరకు మొదటిసారిగా 1832లో ప్రణాళిక ప్రవేశపెట్టబడినప్పటికీ, ఆ తరువాత మరో దశాబ్దం వరకూ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేదు. 1844లో అప్పటి గవర్నర్ జనరెల్ విస్కౌంట్ హార్డింగ్(Lord Hardinge) రైల్వేలలో ప్రయివేటు వ్యక్తుల పెట్టుబడులను అనుమతించాడు. ఇదే కాక రెండు రైల్వే సంస్థలను (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ)స్థాపించి నూతన పెట్టుబడిదారులకు సాయపడవలసిందిగాసాహయపడవలసిందిగా కోరాడు. ఆ తరువాతి కొద్ది సంవత్సరాలలో బ్రిటిష్ పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా అనేక రైలు మార్గాలు వేగంగా నిర్మించబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి రైలు 22 డిసెంబర్ 1851న నడుపబడింది. ఇది రూర్కీలో నిర్మాణ సామాగ్రిని తరలించడానికి వినియోగించబడింది. ఆ తరువాత ఒకటిన్నర సంవత్సరాలకు అనగా ది.16 ఏప్రిల్ 1853లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది. ఈ ప్రయాణం మొత్తం దూరం 34 కి.మీ కాగా, సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే ఇంజిన్లను వినియోగించారు. ఒక విధంగా ఈ సంఘటన భారత రైల్వేలకు అంకురార్పణ చేసిందని చెప్పుకోవచ్చు.
 
పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నూతన పధకాలను ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం, పెట్టుబడిదారులకు మొదటి కొద్ది సంవత్సరాలకు కనీసం ఐదు శాతం లాభాలకు హామీ లభిస్తుంది. సంస్థ ప్రారంభమైన తరువాత అది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనమౌతుంది, కానీ సంస్థ మీద అజమాయిషీ మాత్రం పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. దీంతో 1880కి, మొత్తం రైలు మార్గాల దూరం 14,500 కి.మీ (9000 మైళ్ళు) వరకు విస్తరించింది. ఇందులో అధికశాతం పెద్ద రేవు పట్టణాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలను చేరుకునేందుకు నిర్మించబడ్డాయి. 1895 నాటికి భారత దేశంలో ఇంజిన్ల తయారీ మొదలయ్యింది. 1896లో భారత ఇంజినీర్లు ఉగాండా రైల్వేను నిర్మించడంలో సాయపడ్డారు.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_రైల్వేలు" నుండి వెలికితీశారు