పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
పియా కా ఘర్ (హిందీ: पिया का घर, ఉర్దూ: پیا کا گھر, అనువాదం: నా ప్రియమైన ఇల్లు) 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి బొంబాయి నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ముంబైచా జావైకి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో సామాన్య గృహస్తుల జీవితంలో అనుభవించే ఇబ్బందులు హాస్యరీతిలో చూపించే సినిమా ఇది.
== ఇతివృత్తం ==
పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరిగిన అమ్మాయి మాలతి([[జయా బాదురీ]])కి పెళ్ళిళ్ళ పేరయ్య బొంబాయి సంబంధం తీసుకువస్తాడు. ఆ పెళ్ళికొడుకు రామ్ (అనిల్ ధావన్) బొంబాయిలో బహుళ అంతస్తుల పాత భవనంలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు. ఐతే పెళ్ళి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళుండేది పెద్ద మేన్షన్లో అంటూ అబద్ధం చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య (ఉండేది పెద్ద భవంతిలో అయినా వారిది చిన్న ఇల్లు). పెళ్ళయ్యాకా ఇంటికి వచ్చి చూస్తే అత్తమామలు, తోడికోడలు బావగారూ, తనూ భర్త ఉండాల్సిన ఇల్లు చిన్నగా, ఇరుకుగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.<br />
కుటుంబం మొత్తానికి 180 అడుగులున్న ఒకే గదిలో సర్దుకోవాల్సి రావడంతో, అట్టలతో గదిని విడదీసుకుని జీవిస్తూంటారు. వంటగదిలో వారికి కేటాయించిన స్థలాన్ని మరోవైపు అట్టముక్క అడ్డుగా పెట్టి తయారుచేస్తారు, దీనికి తోడు మరోవైపునున్న కిటికీ తెరుచుకునే ఉంటుంది. అట్టముక్కకి అవతలివైపు మాలతి బావగారూ, తోడికోడలికి కేటాయించిన చోటు (మరో అట్టముక్కతో దాన్ని తయారుచేశారు), గదికి వెలుపల అత్తామావలు, మరిది ఉంటారు. మాటలు, చేతలు అందరికీ వినిపిస్తూంటాయని, కనిపిస్తూంటాయని మాలతి భయం. మాలతి మాత్రం పెళ్ళై ఎన్ని రోజులైనా ఆ దాపులేని స్థలంలో భర్తను సమీపించడానికి సంకోచిస్తుంది. భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం దరిచేరదు. భర్తను బయటకి వెళ్ళి పడుకొమ్మంటుంది.<br />
ఒకరోజు అనుకోకుండా అందరూ నాటకానికి వెళ్తారు, ఆమె సంబరపడగా ఈ సంగతి తెలియని భర్త ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని జారవిడుస్తాడు. వీళ్ళ అవస్థ తెలుసుకున్న పెద్దలు మరోసారి కావాలనే సినిమాకి పరివారాన్ని అంతా వెంటబెట్టుకుని సినిమాకి వెళ్తారు. సినిమాకి అని వెళ్ళిన పెద్దలు కూడా జంటలు జంటలుగా విడిపోయి ఏకాంతం కోసం ఒకరువిడిపోతారు. తల్లిదండ్రులు బీచ్ కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటే, మరొకరుఅన్నావదినలు లాడ్జికి వెళ్తారు. ఆ ఇరుకు ప్రదేశంలో అనుభవించలేని ఏకాంతం కోసం. ఐతే దురదృష్టవశాత్తూ ఇంట్లోని కొత్తజంట ఏకాంతాన్ని మాత్రం భగ్నం చేస్తూ అనుకోని అతిథులు దిగుతారు. అన్నయ్య రామ్ తో ఏదైనా హోటల్ లో రూం తీసుకుని, హాయిగా తిరిగిరా అని సలహా ఇస్తాడు.
 
== థీమ్స్ ==
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు