పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
కుటుంబం మొత్తానికి 180 అడుగులున్న ఒకే గదిలో సర్దుకోవాల్సి రావడంతో, అట్టలతో గదిని విడదీసుకుని జీవిస్తూంటారు. వంటగదిలో వారికి కేటాయించిన స్థలాన్ని మరోవైపు అట్టముక్క అడ్డుగా పెట్టి తయారుచేస్తారు, దీనికి తోడు మరోవైపునున్న కిటికీ తెరుచుకునే ఉంటుంది. అట్టముక్కకి అవతలివైపు మాలతి బావగారూ, తోడికోడలికి కేటాయించిన చోటు (మరో అట్టముక్కతో దాన్ని తయారుచేశారు), గదికి వెలుపల అత్తామావలు, మరిది ఉంటారు. మాటలు, చేతలు అందరికీ వినిపిస్తూంటాయని, కనిపిస్తూంటాయని మాలతి భయం. మాలతి మాత్రం పెళ్ళై ఎన్ని రోజులైనా ఆ దాపులేని స్థలంలో భర్తను సమీపించడానికి సంకోచిస్తుంది. భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం దరిచేరదు. భర్తను బయటకి వెళ్ళి పడుకొమ్మంటుంది.<br />
ఒకరోజు అనుకోకుండా అందరూ నాటకానికి వెళ్తారు, ఆమె సంబరపడగా ఈ సంగతి తెలియని భర్త ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని జారవిడుస్తాడు. వీళ్ళ అవస్థ తెలుసుకున్న పెద్దలు మరోసారి కావాలనే సినిమాకి పరివారాన్ని అంతా వెంటబెట్టుకుని సినిమాకి వెళ్తారు. సినిమాకి అని వెళ్ళిన పెద్దలు కూడా జంటలు జంటలుగా ఏకాంతం కోసం విడిపోతారు. తల్లిదండ్రులు బీచ్ కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటే, అన్నావదినలు లాడ్జికి వెళ్తారు. ఆ ఇరుకు ప్రదేశంలో అనుభవించలేని ఏకాంతం కోసం. ఐతే దురదృష్టవశాత్తూ ఇంట్లోని కొత్తజంట ఏకాంతాన్ని మాత్రం భగ్నం చేస్తూ అనుకోని అతిథులు దిగుతారు. అన్నయ్య రామ్ తో ఏదైనా హోటల్ లో రూం తీసుకుని, హాయిగా తిరిగిరా అని సలహా ఇస్తాడు. ఆ ప్రయత్నమూ పోలీసులు రావడంతో రసాభాస అయి, వికటిస్తుంది.<br />
ఈ ఇబ్బందులన్నీ పల్లెటూరులోని మాలతి పెదనాన్నకు తెలుస్తుంది. ఇలాంటి చాల్(కథానాయకుడి కుటుంబం ఉండే అపార్ట్ మెంట్స్ వంటిదాన్ని చాల్ అనేవారు బొంబాయిలో) లో ఉండాల్సిన ఖర్మ నా కూతురుకు పట్టలేదు, మా ఊరు తీసుకుపోతాను అని కోపంగా వస్తాడు. మాలతికి కూడా ఇరుకు ఇరుకు బతుకుతో విసిగొచ్చి వెళ్ళిపోయేందుకు తగ్గ మనస్థితిలో ఉంటుంది. తమను వదిలి ఆమె వెళ్ళిపోవడాన్ని అక్కడివారెవరూ అంగీకరించలేకపోతారు. ఆమె ఏకాంతం కోసం అత్తమామలు తీర్థయాత్రలకు బయల్దేరగా, తోడికోడలు-బావగారూ గది ఖాళీచేసి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడతారు. చుట్టుపక్కల వారు కూడా తల తాకట్టైనా పెట్టి వారిద్దరికీ ఓ ఇల్లు చూసిపెడతామని పెద్దాయనకు మాట ఇస్తారు.
 
== థీమ్స్ ==
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు