పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
ఒకరోజు అనుకోకుండా అందరూ నాటకానికి వెళ్తారు, ఆమె సంబరపడగా ఈ సంగతి తెలియని భర్త ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని జారవిడుస్తాడు. వీళ్ళ అవస్థ తెలుసుకున్న పెద్దలు మరోసారి కావాలనే సినిమాకి పరివారాన్ని అంతా వెంటబెట్టుకుని సినిమాకి వెళ్తారు. సినిమాకి అని వెళ్ళిన పెద్దలు కూడా జంటలు జంటలుగా ఏకాంతం కోసం విడిపోతారు. తల్లిదండ్రులు బీచ్ కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటే, అన్నావదినలు లాడ్జికి వెళ్తారు. ఆ ఇరుకు ప్రదేశంలో అనుభవించలేని ఏకాంతం కోసం. ఐతే దురదృష్టవశాత్తూ ఇంట్లోని కొత్తజంట ఏకాంతాన్ని మాత్రం భగ్నం చేస్తూ అనుకోని అతిథులు దిగుతారు. అన్నయ్య రామ్ తో ఏదైనా హోటల్ లో రూం తీసుకుని, హాయిగా తిరిగిరా అని సలహా ఇస్తాడు. ఆ ప్రయత్నమూ పోలీసులు రావడంతో రసాభాస అయి, వికటిస్తుంది.<br />
ఈ ఇబ్బందులన్నీ పల్లెటూరులోని మాలతి పెదనాన్నకు తెలుస్తుంది. ఇలాంటి చాల్(కథానాయకుడి కుటుంబం ఉండే అపార్ట్ మెంట్స్ వంటిదాన్ని చాల్ అనేవారు బొంబాయిలో) లో ఉండాల్సిన ఖర్మ నా కూతురుకు పట్టలేదు, మా ఊరు తీసుకుపోతాను అని కోపంగా వస్తాడు. మాలతికి కూడా ఇరుకు ఇరుకు బతుకుతో విసిగొచ్చి వెళ్ళిపోయేందుకు తగ్గ మనస్థితిలో ఉంటుంది. తమను వదిలి ఆమె వెళ్ళిపోవడాన్ని అక్కడివారెవరూ అంగీకరించలేకపోతారు. ఆమె ఏకాంతం కోసం అత్తమామలు తీర్థయాత్రలకు బయల్దేరగా, తోడికోడలు-బావగారూ గది ఖాళీచేసి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడతారు. చుట్టుపక్కల వారు కూడా తల తాకట్టైనా పెట్టి వారిద్దరికీ ఓ ఇల్లు చూసిపెడతామని పెద్దాయనకు మాట ఇస్తారు.<br />
తాను ఇందరి ప్రేమకు పాత్రురాలయ్యానని, ఇల్లు ఇరుకైనా వీరి మనసు విశాలమని గ్రహించిన ఆమె ఉండిపోతుంది. తన కోసం ఇన్ని వదులుకోవడానికి వీరు సిద్ధపడితే, తాను ఆ మాత్రం సర్దుకోలేనా అంటూ కలిసిపోతుంది.
== థీమ్స్ ==
|