పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
[[File:Chawl - Mumbai 2006.jpg|thumb|బొంబాయిలోని చాల్ దృశ్యం]]
* '''నగర జీవితంలో నివాసం''': బొంబాయి మహానగరం జనాభాకు అనుగుణంగా పరిణామంలో విస్తరించే వీలులేనిది కావడంతో 1950ల కల్లా నగరంలో జీవించేందుకు స్థలం పెద్ద సమస్య అయికూర్చుంది. ఈ నేపథ్యంలో పేదవాళ్ళతో మురికివాడలు తయారుకాగా, మధ్యతరగతి వాళ్ళకి చాల్స్ ఏర్పడ్డాయి. బ్రిటీష్ కాలంలో జైళ్ళుగా ఉన్నవాటిని కూడా తర్వాతికాలంలో చాల్స్ గా మార్చారని ప్రతీతి. ఒక్కో గదీ కనీసం ఆరేడుగురు ఉండే కుటుంబానికి నివాసంగా అద్దెకి ఇచ్చే చాల్స్ ఏర్పడ్డాయి.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్">{{cite book|last1=మహమ్మద్|first1=ఖదీర్ బాబు|title=బాలీవుడ్ క్లాసిక్స్|date=2010|publisher=కావలి ప్రచురణలు|location=హైదరాబాద్|pages=138 - 140|edition=1|chapter=ఆధునికతతో అడ్జస్ట్‌మెంట్}}</ref>
* '''మనుషుల నగరీకరణ''': కథానాయిక బొంబాయిలోని ఇరుకిళ్ళలో సర్దుకోలేకపోవడానికి ఆమె పల్లెటూరులో విశాలమైన ఇంట్లో నివసించడమే కారణంగా చూపుతారు దర్శకుడు. అదే చాల్ లో జీవిస్తున్న వారికి పెద్దగా లేని సంకోచం కూడా ఆమెకు రావడానికి తను పల్లె నేపథ్యమే కారణం. ఆఖరుకు ఆమె నగరీకరణ చెందుతుంది, ఆ జీవితాన్నే ఇష్టంగా చేసుకుంటుంది. అందుకు సంకేతంగా మాలతి ప్రారంభంలో విమానం వెళ్తున్న శబ్దం వినిపించగానే పరుగెత్తుకెళ్ళి కిటికీలోంచి చూస్తుంది, సినిమా చివరి సన్నివేశంలో మాత్రం విమానం శబ్దం వినిపించినా చూడదు, భర్త గుర్తుచేసినా పట్టించుకోదు. బొంబాయి జీవితంలో బయటివారికి విడ్డూరంగా కనిపించే విచిత్రాలు ఆమెకు ఇక సామాన్యమని, ఆమె స్థానికురాలైపోయిందని చూపించారు దర్శకుడు.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు