పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పియా కా ఘర్ (హిందీ: पिया का घर, ఉర్దూ: پیا کا گھر, అనువాదం: నా ప్రియమైన ఇల్లు) 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి బొంబాయి నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ముంబైచా జావైకి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో సామాన్య గృహస్తుల జీవితంలో అనుభవించే ఇబ్బందులు హాస్యరీతిలో చూపించే సినిమా ఇది.<br />
పల్లెటూరులో విశాలమైన ప్రదేశంలో స్వేచ్ఛగా జీవించిన మాలతికి వివాహమై బొంబాయి నగరంలోని ఓ ఇరుకు ఇంట్లో జీవించాల్సివస్తుంది. సరైన దాపులేని ప్రదేశం కావడంతో భర్తకు చేరువకాకుండా దూరంగానే ఉండిపోతుంది. వారిద్దరికీ ఏకాంతం కల్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము అవుతాయి. చివరకి పల్లెటూరు పెద్దమనిషి అయిన ఆమె పెదనాన్నకి విషయం తెలసి తీసుకెళ్ళబోతాడు. మాలతి మీది అభిమానంతో ఇంట్లోవాళ్ళంతా తమ కొద్దిపాటి ప్రదేశాన్నీ త్యాగం చేయడం, చుట్టుపక్కల వారూ తమ ప్రయత్నం తాము చేయడం చూసిన మాలతి వారి ప్రేమకి లొంగి ఉండిపోతుంది. ఆమె చివరకి పట్నవాసం పిల్ల కావడం ముగింపు.<br />
బొంబాయిలో స్థలాభావం వల్ల మధ్యతరగతి వారు ఆరేడుగురు కలిసి ఒకే గదిలో సర్దుకుని జీవించే చాల్స్ పుట్టుకువచ్చాయి.
 
== ఇతివృత్తం ==
పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరిగిన అమ్మాయి మాలతి([[జయా బాదురీ]])కి పెళ్ళిళ్ళ పేరయ్య బొంబాయి సంబంధం తీసుకువస్తాడు. ఆ పెళ్ళికొడుకు రామ్ (అనిల్ ధావన్) బొంబాయిలో బహుళ అంతస్తుల పాత భవనంలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు. ఐతే పెళ్ళి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళుండేది పెద్ద మేన్షన్లో అంటూ అబద్ధం చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య (ఉండేది పెద్ద భవంతిలో అయినా వారిది చిన్న ఇల్లు). పెళ్ళయ్యాకా ఇంటికి వచ్చి చూస్తే అత్తమామలు, తోడికోడలు బావగారూ, తనూ భర్త ఉండాల్సిన ఇల్లు చిన్నగా, ఇరుకుగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.<br />
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు