బాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాలి''' [[ఇండోనేషియా]] లోని ఒక [[ద్వీపం]]. ప్రముఖ ప్రపంచ పర్యటక ప్రాంతమైన ఈ ధ్వీపం ప్రాచీన హిందు సంస్కృతికి, ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ్ఇక్కడ 90% [[హిందువు]]లు ఉన్నారు.
 
హిందువుల పుణ్యస్థలి బాలి
పంక్తి 5:
 
==బాలి==
బాలి పర్యాటకుల స్వర్గం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు స్త్రీలు పై వస్త్రావస్త్రాలు లేకుండా సంచరించేవారు. కాని ఇప్పుడు స్త్రీలు జాకెట్లు వేసుకోవటానికి అలవాటు పడ్డారు. అయినా 23 కోట్ల ముస్లిం జనాభా కల ఇండొనేసియా దేశంలో 80% హిందువులు నివసించే బాలి ఇప్పుడుకూడా ఒక వింతగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యాటకులు వస్తుండటం విశేషం.
 
మనదేశంలో వేళ్లూనుకొని ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్త్రీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యల ద్వారా సాంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు ఇక్కడి స్త్రీలు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్‌ దీవుల మధ్య నున్నది బాలీ దీవి. మొత్తం 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో బాలీ అందం ప్రత్యేకత మరి దేనికీ లేదంటారు. బాలీ తూర్పునుంచీ పశ్చిమానికి 140 కి.మీ., ఉత్తరం నుంచీ దక్షిణానికి 80 కి.మీ విస్తరించి ఉంది. అయితే తూర్పు నుంచీ పశ్చిమానికి నిప్పులు చెరిగే పర్వతాలు ఉండటం దురదృష్టంగానూ భావిస్తారు. వీటిలో అత్యంత పెద్దది గునుంగ్‌ అగుంగ్‌ పర్వతం 1963లో పేలి నిప్పు నది ప్రవహించింది. ఆ తర్వాత ఇంతవరకూ అలాంటవి సంభవించలేదు. ఈక్వేటర్‌కి ఎనిమిది డిగ్రీలు దక్షిణంగా ఉన్న ఈ బాలీ వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజన్లే ఉంటాయి. ప్రతీ సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్‌ వేడిమి ఉంటుంది. భారీ వర్షాల కాలంలో పచ్చగా మెరుస్తూ మహాద్బుతంగా ఉంటుంది బాలీ. ఎంతో మాగాణి భూమి కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. బాలీ దక్షిణాన కొండప్రాంతాల్లో ధాన్యం, ఉత్తర తీర ప్రాంతాల్లో కాఫీ, కూరగాయలు బాగా పండుతాయి.
"https://te.wikipedia.org/wiki/బాలి" నుండి వెలికితీశారు