మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox officeholder
|honorific-prefix =
|name = Sir Salar Jung
|native_name =
|native_name_lang =
|honorific-suffix = [[Order of the Star of India|GCSI]]
|image = Sir Salar Jung.jpg
|imagesize =
|caption = <center>The Nizam's indispensable Prime Minister, Sir Salar Jung</center>
|office = [[Prime Minister of Hyderabad]]
|term_start = 1853
|term_end = 1883
|monarch = [[Asaf Jah IV]]<br />[[Asaf Jah V]]<br />[[Asaf Jah VI]]
|predecessor = Siraj ul-Mulk
|successor = [[Mir Laiq Ali Khan, Salar Jung II]]
|birth_date = 1829
|birth_place = [[Bijapur, Karnataka|Bijapur]], [[Satara]]
|death_date = 1883
|death_place = [[Hyderabad, India|Hyderabad]], [[Hyderabad State]]
|religion = [[Islam]]
}}
 
'''మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I''' (1829–1883) హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన రాజకీయవేత్త, హైదరాబాద్ రాజ్య దివాన్. హైదరాబాద్ రాజ్యానికి దివాన్లుగా పనిచేసిన వారందరిలోకీ గొప్పవానిగా సుప్రసిద్ధుడు. నిజాం పాలకులు ఆయనకు సాలార్ జంగ్ అన్న బిరుదు ఇవ్వగా, బ్రిటీష్ వారు సర్ బిరుదాన్ని ఇచ్చారు. వెరసి సర్ సాలార్ జంగ్ గా ఆయన సుప్రసిద్ధి పొందారు. ఆయన వంశానికే చెందిన, హైదరాబాద్ రాజ్య దివానులైన ముగ్గురు సాలార్ జంగ్ లలో ఈయన మొదటివారు. సాధారణ ప్రజానీకం ఆయనను నవాబ్ సాహెబ్ గా పిలిచేవారు.<br />
ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి సాలార్ జంగ్, ఆయన మరణానంతరం పసిపిల్లవాడైన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కు పద్నాలుగేళ్ళ పాటు మంత్రిత్వం నెరపారు. తరాలుగా రాజ్యంలో బ్రిటీష్ ప్రతినిధి అయిన రెసిడెంట్, భారతదేశంలో బ్రిటీష్ పరిపాలన నెరపే వైశ్రాయ్/గవర్నర్ జనరల్ ల మాటకు ఎదురు లేని హైదరాబాద్ రాజ్యంలో మొదటి సాలార్ జంగ్ మాత్రం దృఢమైన వ్యక్తిత్వంతో తనకు ఇష్టంవచ్చిన సంస్కరణలు అమలుచేశారు. ప్రభుత్వంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, అలసత్వం చక్కదిద్దుతూ పాలనాపరమైన సంస్కరణలకు నాంది పలికారు. మొత్తం ప్రభుత్వాన్ని తన పట్టులో నిలుపుకుని ప్రభావశీలమైన కృషిచేశారు.