భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
1973-75 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త రాజకీయ ఆందోళనలు చెలరేగాయి. (దీనివల్ల కొందరు కాంగ్రెస్-పార్టీ నేతలు మరింత శక్తిని ఎన్నికైన పరిపాలకుని చేతిలో పెట్టేలాంటి ప్రెసిడెంట్ విధానం కావాలని కోరారు). డిసెంబర్ 1973 నుంచి మార్చి 1974 వరకూ గుజరాత్ లో సాగిన [[నవ నిర్మాణ్ ఉద్యమం]] వీటన్నిటిలోనూ ప్రసిద్ధిపొందింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి ప్రభుత్వాన్ని రద్దుచేసేదాకా సాగింది. ఉద్యమం, ఆందోళనల ఫలితంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా, ఆపైన రాష్ట్రపతి పాలన విధింపు జరిగాయి. 1977లో తిరిగి ఎన్నికలు జరిగాకా ఇందిర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన జనతా కూటమి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. మార్చి-ఏప్రిల్ 1974లో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి చేసిన విద్యార్థి ఉద్యమానికి జెపిగా వ్యవహరించే గాంధేయ సోషలిస్టు, ప్రముఖ నాయకుడు [[లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ్]] మద్దతు లభించింది. 1974 ఏప్రిల్లో పాట్నాలో జెపి విద్యార్థి, రైతు, కార్మిక సంఘాలు అహింసాయుతంగా భారతీయ సమాజాన్ని మార్చాలంటూ "సంపూర్ణ విప్లవానికి" పిలుపునిచ్చారు. అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు, కానీ కేంద్రం అంగీకరించలేదు. నెలరోజుల తర్వాత దేశంలోకెల్లా అతిపెద్ద యూనియన్ అయిన రైల్వే ఉద్యోగుల యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేసింది. వేలాదిమంది కార్మికులను నిర్బంధించి, వారి కుటుంబాలను రైల్వే క్వార్టర్స్ నుంచి తరిమివేసి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ సమ్మెను దారుణంగా అణచివేసింది. పార్లమెంటులో కూడా ప్రభుత్వం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. 1966లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇందిరా గాంధీ లోక్ సభలో 10 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.<ref>http://164.100.47.134/intranet/pract&proc/chapter-XXVIII.pdf</ref>
===''రాజ్ నారాయణ్'' తీర్పు===
1971 పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది [[శాంతి భూషణ్]] వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. 12 జూన్ 1975న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ప్రధాని మీది ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు వీగిపోయాయి, కానీ ఆమె ప్రభుత్వ యంత్రాగాన్ని తప్పుగా వినియోగించుకున్న అంశంలో నేరస్తురాలని తేలింది. ఈ నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సభలకు వేదికలు నిర్మించడం, వాటికి రాష్ట్ర విద్యుత్తు విభాగం నుంచ విద్యుత్తు వినియోగించుకోవడం, అప్పటికి రాజీనామా చేయని ప్రభుత్వాధికారి యశ్ పాల్ పూర్తయ్యేలా చూడమని దర్శకుడు అన్నారు.<br />
ఇందిరపై మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా అవి తొలగి వాటితో పోలిస్తే అల్పమైన ఆరోపణల వల్ల ఆమెను పదవి నుంచి తొలగించడంతో, ''ద టైమ్స్'' ఈ పరిణామాన్ని ''ట్రాఫిక్ టికెట్ మీద ప్రధానమంత్రిని పదవిలోంచి తలొగించడంగా'' అభివర్ణించింది.
<!-- Because the court unseated her on comparatively frivolous charges, while she was acquitted on more serious charges, ''[[The Times]]'' described it as "firing the Prime Minister for a traffic ticket". However, strikes in trade, student and government unions swept across the country. Led by JP, Narain, [[Satyendra Narayan Sinha]] and [[Morarji Desai]], protestors flooded the streets of Delhi close to the Parliament building and the Prime Minister's residence. The persistent efforts of Narain were praised worldwide as it took over four years for Justice Sinha to pass judgement against the prime minister.
-->