సత్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| children = దివ్య సత్యరాజ్ , శిబిరాజ్
}}
'''సత్యరాజ్''' (జ. 3 అక్టోబరు 1954) ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]], [[శంఖం (సినిమా)|శంఖం]] లాంటి సినిమాల్లో నటించాడు.
== బాల్యం ==
సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయనకు కల్పన, రూప అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన జన్మనామం రంగరాజ్. చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ కు వీరాభిమాని. <ref>http://archives.chennaionline.com/interviews/satayaraj.asp</ref> సత్యరాజ్ కోయంబత్తూరులోని సెయింట్ మేరీస్ కాన్వెంటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత రామ్ నగర్ లోని సబర్బన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీయెస్సీ బోటనీ చదివాడు.<ref name="thehindu1">{{cite news|author=Subha J Rao |url=http://www.thehindu.com/news/cities/chennai/chen-cinema/many-shades-of-grey/article4683478.ece |title=Many shades of grey |publisher=The Hindu |date=2013-05-04 |accessdate=2013-11-27 |location=Chennai, India}}</ref>
"https://te.wikipedia.org/wiki/సత్యరాజ్" నుండి వెలికితీశారు