ముద్రారాక్షసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముద్రారాక్షసం''' [[విశాఖదత్తుడు]] రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా [[చంద్రగుప్త మౌర్యుడు]] రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని [[చాణక్యుడు|చాణక్యుని]] నీతి చతురత సహాయంతో నిర్మూలించి [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]] [[పాటలీపుత్ర|పాటలీపుత్రాన్ని]] పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి [[రాక్షస మంత్రి]] తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది. చివరికి చాణక్యుని మంత్రాంగానికి చిక్కి రాక్షస మంత్రి చంద్రగుప్తునికి మంత్రిత్వం వహించేందుకు అంగీకరించడంతో నాటకం పూర్తవుతుంది.
== ఇతివృత్తం ==
చంద్రగుప్తునికి పరాభవం జరుగుతుందన్న సూచన విని కోపంతో తానున్నంత వరకూ చంద్రగుప్తునికి అవమానం కలుగజేసే మొనగాడెవరంటూ చాణక్యుడు రావడంతో నాటకం ప్రారంభం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ముద్రారాక్షసం" నుండి వెలికితీశారు