"ముద్రారాక్షసం" కూర్పుల మధ్య తేడాలు

'''ముద్రారాక్షసం''' [[విశాఖదత్తుడు]] రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా [[చంద్రగుప్త మౌర్యుడు]] రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని [[చాణక్యుడు|చాణక్యుని]] నీతి చతురత సహాయంతో నిర్మూలించి [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]] [[పాటలీపుత్ర|పాటలీపుత్రాన్ని]] పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి [[రాక్షస మంత్రి]] తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది. చివరికి చాణక్యుని మంత్రాంగానికి చిక్కి రాక్షస మంత్రి చంద్రగుప్తునికి మంత్రిత్వం వహించేందుకు అంగీకరించడంతో నాటకం పూర్తవుతుంది.
== ఇతివృత్తం ==
చంద్రగుప్తునికి పరాభవం జరుగుతుందన్న సూచన విని కోపంతో తానున్నంత వరకూ చంద్రగుప్తునికి అవమానం కలుగజేసే మొనగాడెవరంటూ చాణక్యుడు రావడంతో నాటకం ప్రారంభం అవుతుంది. ఐతే నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్తుణ్ణి రాజుగా నిలబెట్టడం, నందుని మంత్రి రాక్షసుడిని వశుణ్ణి చేసుకున్నాకానే సంపూర్ణమౌతుందని గ్రహిస్తాడు. తన రాజైన నందుణ్ణి చంపి రాజ్యం చేపట్టిన చంద్రగుప్తుణ్ణి ఎలాగైనా చంపాలని పగతో రగులుతూంటాడు రాక్షస మంత్రి. అందుకోసం తన వలెనే చంద్రగుప్తునిపై కత్తికట్టిన మలయకేతువు, పర్వతేశ్వరుల వంటివారితో చేయికలుపుతాడు. చంద్రగుప్తుణ్ణి మట్టుపెట్టేందుకు తయారుచేసిన విషకన్యను అతనిపైకి ప్రయోగిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1866951" నుండి వెలికితీశారు