"ముద్రారాక్షసం" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:సంస్కృత కావ్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (వర్గం:సంస్కృత కావ్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చంద్రగుప్తుని చంపేందుకు రాక్షసుడు పన్నిన ఎత్తుగడలన్నీ విఫలం కావడంతో భేదోపాయాన్ని ఎంచుకుంటాడు. చాణక్య చంద్రగుప్తుల నడుమ విభేదాలు సృష్టించాలని వైతాళికుల వేషంలో ఇద్దరు గూఢచారుల్ని చంద్రగుప్తుని వద్దకు పంపుతాడు రాక్షస మంత్రి. వీరు చంద్రగుప్తునికి గర్వం, అహంకారం పుట్టించేలాంటి స్తుతి చేస్తూంటారు. చాణక్య చంద్రగుప్తులిద్దరూ తమ తమ కార్యసఫలత వల్ల గర్వులై, సంతృప్తులై ఉన్నారు కనుక వారి మధ్య వివాదం పుట్టించడం సులభమని రాక్షస మంత్రి యోచన.<br />
రాక్షస మంత్రి చేసిన ఈ పన్నాగాన్ని తెలుసుకున్న చాణక్యుడు తమ మధ్య విభేదాలు పొడసూపినట్టు ప్రవర్తించమని చంద్రగుప్తుడితో చెప్తాడు. భేదాన్ని సృష్టించినట్టు నటించేందుకు గాను పాటలీపుత్రంలో కౌముదీ మహోత్సవాన్ని చేయాలని చంద్రగుప్తుడు ప్రకటించగా, కౌముదీ మహోత్సవంలో ప్రజలు, రాజాధికారులు అప్రమత్తులై ఉండగా దండెత్తివచ్చేందుకు రాక్షస, మలయకేతువులకు అవకాశం దొరుకుతుందని చాణక్యుడు అంటాడు. ఆ అవకాశం లేకుండా చేయాలంటే కౌముదీ మహోత్సవాన్ని చేయరాదని చాణక్యుడు శాసిస్తాడు. చాణక్య చంద్రగుప్తులు వాగ్వాదం చేసుకున్నట్టు నటిస్తారు. ఈ అదను చూసుకుని చంద్రగుప్తుడి కోపం రెచ్చగొట్టే స్తుతి చదువుతారు వైతాళికులు.
 
[[వర్గం:సంస్కృత కావ్యాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1867291" నుండి వెలికితీశారు