"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

(వేదిక మూస)
 
==కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం==
తమిళ చలనచిత్ర పరిశ్రమ [[కోలీవుడ్]] అని పేరు పొందినది. యాభై మరియు అరవై దశకం లో స్టూడియోలు మద్రాసు మహానగరం లో వుండటం వలన తెలుగు మరియు తమిళ సినిమాకి మంచి సంబంధం కలదు. నేటికి అనేక తెలుగు చలనచిత్రాలు తమిళంలో, మరియు తమిళ చలనచిత్రాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం మామూలూ. అలగే తెలుగు తారలు తమిళం లో నటించటం తమిళ తారలు తెలుగులో నటించడం సహజం. ప్రముఖ తారలు [[త్రిష]], [[ఇలియానా]] 123 లక్షల వరకు; [[శ్రియ]], [[జెనీలియ]], [[సదా]], [[భూమిక]] చావ్లా, ఛార్మి (వీళ్ళంతా ముంబాయికి సంబందించిన వాళ్ళు) 150 నుండి 160 లక్షల వరకు తీసుకుంటారు. నయన తార, ఆసిన్, [[అనుష్క]] వంటి వారు నటించే రోజులు బట్టి 130 నుండి 140 లక్షల వరకు తీసుకుంటారు.
 
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు.<!-- The swapping of stories and heroines between Kollywood and Tollywood is common. --> తెలుగువాడైన [[విద్యాసాగర్]] కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, [[శంకర్]] వంటి దర్శకులు, [[ఏ.ఎమ్.రత్నం]] వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
 
ఒక పక్క టాలీవుడ్ కోలీవుడ్ మధ్య కొన్ని దశకాలుగా సంబంధం వున్నటైతే టాలీవుడ్ మరియు బాలీవుడ్ మధ్య వున్నా సంబంధం మొన్న మొన్నటిదిగా లెక్క వెయ్య వచ్చు. ఎనభై దశకాల దాకా టాలీవుడ్లో హిట్ అయ్యిన హిందీ చిత్రాలను తెలుగులో రిమేక్ చెయ్యడం దాకానే పరిమితమైనది. తొంభై దశకంలో తెలుగు [[రామ్ గోపాల్ వర్మ ]]లాంటి దర్శకుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి పేరు ప్రతిష్టలు సంపాదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంద్ మరియు నాగార్జున ఖుదా గవః మరియు క్రిమినల్ లాంటి హిట్ చిత్రాలలో నటించారు. క్రితం పదేళ్లుగా హిందీ అభినేత్రులు తెలుగు సినిమా లో నటించడం మామూలూ అయ్యింది. అంజల జావేరీ, [[కత్రినా కైఫ్]] వంటి అభినేత్రులు తెలుగులో నటించారు.
 
==ప్రత్యేకతలు==
2,13,909

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1867481" నుండి వెలికితీశారు