ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| influences = [[François Viète]], [[Gerolamo Cardano]], [[Diophantus]]
| known_for = [[List of things named after Pierre de Fermat|See full list]]
[[Number theory]]
[[Analytic geometry]]
[[Fermat's principle]]
[[Probability]]
[[Fermat's Last Theorem]]
[[Adequality]]}}
పియేర్ డి ఫెర్మా (Pierre de Fermat, 20 Aug 1601- ) ఫ్రాంసు లో పుట్టేడు. తండ్రి, డామినీక్ ఫెర్మా, సామంతుడైన (తోలు) వ్యాపారస్తుడు కావడం వల్ల పియేర్ కి మంచి పాఠశాలలో విద్యాభ్యాసం చేసే అవకాశం లభించింది. కాని విద్యార్థి దశలో ఫెర్మా ప్రతిభావంతుడైన గణిత శాస్త్ర వేత్తగా పరిణతి చెందుతాడనుకోడానికి దాఖలాలు కనిపించలేదు.

==పుట్టుక==
పియేర్ డి ఫెర్మా (Pierre de Fermat, 20 Aug 1601- ) ఫ్రాంసు లో పుట్టేడు. తండ్రి, డామినీక్ ఫెర్మా, సామంతుడైన (తోలు) వ్యాపారస్తుడు కావడం వల్ల పియేర్ కి మంచి పాఠశాలలో విద్యాభ్యాసం చేసే అవకాశం లభించింది. కాని విద్యార్థి దశలో ఫెర్మా ప్రతిభావంతుడైన గణిత శాస్త్ర వేత్తగా పరిణతి చెందుతాడనుకోడానికి దాఖలాలు కనిపించలేదు.
==ఉద్యోగం==
ఇంట్లో పెద్దల ఒత్తిడి మీద సర్కారీ నౌకరీలో చేరేడు. ప్రజలు దాఖలు చేసుకున్న అర్జీలని పరీక్షించి వాటిలో యోగ్యత కలవాటిని ఎంపిక చేసి ప్రభువుకి దఖలు పరచే ఉద్యోగం అది. ఫెర్మా ఆ ఉద్యోగాన్ని ఎంతో దక్షతతో, సమర్ధవంతంగా నిర్వర్తించేడు.

Line 23 ⟶ 25:

ఆనాటి ప్రాంసులోని ఈతి బాధలలో పాడుగా ఉన్న ప్రజారోగ్య వాతావరణం ఒకటయితే అంతకంటె పాడుగా ఉన్న రాజకీయ వాతావరణం మరొకటి. ఫెర్మా ప్రాంతీయ శాసన సభకి నియామకం అయిన కొత్త రోజులలోనే కార్డినల్ రిచెలూ ప్రాంసుకి ప్రథాన మంత్రిగా నియామకం పొందేడు. కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్లు రివాజుగా జరిగే ఆ రోజులలో ఫెర్మా జీవితం అసిధారా వ్రతంలా ఉండేది. "నొప్పింపక, తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అన్న పద్యం లోని నీతి సారాన్ని అక్షరాలా ఆచరించి, ఫెర్మా తన పనులు తాను తల వంచుకుని చేసుకుంటూ, తీరిక సమయాలలో గణితంలో తారసపడే చిక్కు సమస్యలకి పరిష్కారాలు వెతికేవాడు. వృత్తి ప్రభుత్యోద్యోగం, వ్యావృత్తి గణితం. గణితాభిలాషి, గణితంలో ఔత్సాహితుడు అంటే ఇతనే అనే పేరు తెచ్చుకున్నాడు.
==గణితంలో అభిలాష==

పదిహేడవ శతాబ్దపు మొదటి రోజులలో గణిత శాస్త్రం ఇంకా చీకటి యుగంలోనే ఉందనవచ్చు. ఆ రోజులలో గణిత శాస్త్రజ్ఞలకి పెద్దగా పరపతి ఉండేది కాదు. ఏదో అంకెలతో గారడీలు చేసే వాళ్ల కోవలో పరిగణించబడేవారు. గలిలియో అంతటివాడికి పీసా విశ్వవిద్యాలయంలో గణితం చదవడానికి అవకాశం రాలేదు; ప్రయివేట్లు చెప్పించుకుని నేర్చుకున్నాడు. అంతవరకు ఎందుకు? యూరప్ ఖండం అంతటికీ ఒక్క ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంలోనే గణితానికి ఒక శాఖ, ఒక పీఠం ఉండేవి.
ఫెర్మా నివసించిన ఊరు పేరిస్ కి దూరం కావడంతో పేరిస్ నగరంలో ఉన్న కొద్ది పాటి గణిత వేత్తలు (ఉ. పాస్కల్, మెర్సెన్) కూడ అందుబాటులో ఉండేవారు కాదు.
Line 35 ⟶ 37:
కేలుక్యులస్ కీ సంభావ్య సిద్ధాంతానికీ ఫెర్మా చేసిన సేవతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోతుంది. ఈ రెండింటితోపాటు సంఖ్యా సిద్ధాంతం (Number Theory) లో కూడ ఫెర్మా మౌలికమైన సేవ చేసేరు.

ఫెర్మాకి గణితంలో గురువంటూ ఎవ్వరూ లేరు. అతని పరిశ్రమ అంతా డయొఫాంటెస్ రాసిన అరిథ్మెటికా (Arithmetica) అనే గ్రంథం. అది వెయ్యేళ్ల గణితసార సంగ్రహం. పైథోగరోస్, యీకిలిడ్యూకిలిడ్ వంటి హేమాహేమీలు ఆవిష్కరించిన శాస్త్రం - ప్రత్యేకించి సంఖ్యా సాస్త్రం - అంతా ఆ గ్రంథంలో క్రోడీకరించబడి ఉంది. ఈ పుస్తకంలో "పులి-మేక-గడ్డిమేటు పడవలో నదిని దాటడం" వంటి గణిత ప్రహేళికలు వందకి పైగా కనిపిస్తాయి. ప్రతీ ప్రహేళికనీ ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించి చూపుతాడు డయొఫాంటెస్. కాని అదేమి (దుర)అదృష్టమో కాని ఈ పుస్తకం చదివి గణితం నేర్చుకున్న ఫెర్మాకి ఈ మంచి అలవాటు అబ్బలేదు. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించే పద్ధతిని ఒక చిన్న కాగితం మీద ముక్తసరిగా మూడు ముక్కలలో సూచించి, దానితో కొన్నాళ్లు చెలగాటాలు ఆడి ఆ కాగితం ముక్కని చెత్త బుట్టలో పడేసేవాడు. అప్పుడప్పుడు, పక్కని కాగితం కనబడకపోతే, ఆ రాయదలుచుకున్నది ఆ పుస్తకం "మార్జిన్"లో గొలికేవాడు. ఇలా మార్జిన్ లో రాసిన ఆణిముత్యాలు ఎన్నో తరవాత తరాలవారికి దొరికేయి.
==ఫెర్మా ఆఖరి సిద్ధాంతం==

అరిథ్మెటికా యొక్క రెండవ సంపుటంలో ఫెర్మాకి పైథాగరోస్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రహేళికలు ఎన్నో కనిపించేయి. పైథాగరోస్ సిద్ధాంతం తెలియనివాళ్లు ఉండరంటే అది అతిశయోక్తి కాదు; చదవనేర్చిన ప్రతి వారికీ ఈ సిద్ధాంతో పరిచయం ఉంటుంది: ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద నిర్మించిన చతురస్రపు వైశాల్యం మిగిలిన రెండు భుజాల మీద నిర్మించిన వైశాల్యాల మొత్తానికి సమానం. ఉదాహరణకి మూడు భుజాల పొడుగులు 3, 4, 5 అయితే పైథాగరోస్ సిద్ధాంతం ప్రకారం

Line 56 ⟶ 58:

ఫెర్మా తల గోక్కునాడు. గోక్కుని, గోక్కుని, ఆ అరిథ్మెటికా పుస్తకం "మార్జిన్" లో "ఈ సమస్యకి పరిష్కారం లేదు. రుజువు రాసి చూపిద్దామంటే ఈ మార్జిన్ లో చోటు సరిపోదు అని రెండు ముక్కలు రాసేసి, మనం అంతా ఆ నాలుగు ముక్కలూ చూసే వేళకి ఆయన హరీమనిపోయేడు. మనకి సమస్య మిగిలింది, ౠజువు దొరకలేదు. మార్జిన్ కాసింత పెద్దదిగా ఉంటే ఆ ౠజువేదో ఆయనే అక్కడ రాసి ఉండేవాడు కదా కుర్రా, పెద్దా ఆ సమస్యని సాధించడానికి నడుం కట్టుకుని రంగం లోకి దూకేరు. దూకి, మూడు వందల ఏళ్ల పాటు నానా కష్టాలు పడ్డ తరువాత, చివరికి 23 జూన్ 1993 న, ఏండ్రూ వైల్స్ అనే ఆసామీ 130 పేజీలు పొడుగున్న ఋజువు రాసి మనని ఒక గట్టెక్కించి మన పరువూ మర్యాదా నిలబెట్టేడు. "ఫెర్మా మార్జిన్ లో రాసింది నిజమే సుమా!" అంటూ అంతా హాశ్చర్యపోయేరు.

==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు