ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఫెర్మా న్యాయ విచారణా వ్యవస్థలో తీర్పరిగా కూడ కొన్నాళ్లు పని చేసేడు. ఈ విధి నిర్వహణలో ఒక మత పురోహితుడికి - తన విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదనే నేరంపై - "సజీవ దహన" (burning at the stake) శిక్ష విధించేడు కూడ.
 
ఈ రెండు ఉద్యోగాలు సుమారుగా భారత దేశం లోని మునస్బుమునసబు-మేజిస్ట్రేటు వంటివి.
 
ఇలా సమాజపు నిచ్చెన మెట్లు ఒకటీ ఒకటీ ఎక్కుతూ చివరికి తన పేరులో డి (de) అనే పట్టపు పేరు తగిలించుకునే హక్కు కూడ సంపాదించుకున్నాడు. ఈ విజయాలన్నిటికి అతని చికీర్ష ఒక్కటే కారణం కాదు; దేశంలో ప్రజారోగ్య పరిస్థితులు కూడ కొంతవరకు దోహదం చేసేయి. ఆ రోజుల్లో ప్లేగు మహామారి యూరప్ లో విస్తృతంగా వ్యాపించి ఎంతో మందిని పొట్టబెట్టుకుంది. ప్రభుత్వోద్యోగులు చనిపోయినప్పుడు ఆ ఖాళీలు భర్తీ చెయ్యాలి కదా. ఫెర్మా ప్లేగు వచ్చి కోలుకున్న వ్యక్తులలో ఒకడు కనుక ఖాళీ అవుతున్న ఆ పై ఉద్యోగాలలోకి జొరబడే అవకాశం ఇతనికి వచ్చింది.
 
ఆనాటి ప్రాంసులోని ఈతి బాధలలో పాడుగా ఉన్నపాడవుతూన్న ప్రజారోగ్య వాతావరణం ఒకటయితే అంతకంటె పాడుగా ఉన్న రాజకీయ వాతావరణం మరొకటి. ఫెర్మా ప్రాంతీయ శాసన సభకి నియామకం అయిన కొత్త రోజులలోనే కార్డినల్ రిచెలూ ప్రాంసుకి ప్రథాన మంత్రిగా నియామకం పొందేడు. కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్లు రివాజుగా జరిగే ఆ రోజులలో ఫెర్మా జీవితం అసిధారా వ్రతంలా ఉండేది. "నొప్పింపక, తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అన్న పద్యం లోని నీతి సారాన్ని అక్షరాలా ఆచరించి, ఫెర్మా తన పనులు తాను తల వంచుకుని చేసుకుంటూ, తీరిక సమయాలలో గణితంలో తారసపడే చిక్కు సమస్యలకి పరిష్కారాలు వెతికేవాడు. వృత్తి ప్రభుత్యోద్యోగం, వ్యావృత్తి గణితం. గణితాభిలాషి, గణితంలో ఔత్సాహితుడు అంటే ఇతనే అనే పేరు తెచ్చుకున్నాడు.
 
==గణితంలో అభిలాష==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు