ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
కేలుక్యులస్ కీ సంభావ్య సిద్ధాంతానికీ ఫెర్మా వేసిన పునాదులకి ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోడానికి సరిపోతాయి. ఈ రెండింటితోపాటు సంఖ్యా సిద్ధాంతానికి (Number Theory) కూడ ఫెర్మా మౌలికమైన పునాదులు చేసేరు.
 
ఫెర్మాకి గణితంలో గురువంటూ ఎవ్వరూ లేరు. అతని పరిశ్రమ అంతా డయొఫాంటెస్ రాసిన అరిథ్మెటికా (Arithmetica) అనే గ్రంథం చదువుకుని స్వయంకృషితో చేసినదే. ఆ గ్రంథం వెయ్యేళ్ల గణితసార సంగ్రహం. పైథోగరోస్, యూకిలిడ్ వంటి హేమాహేమీలు ఆవిష్కరించిన శాస్త్రం - ప్రత్యేకించి సంఖ్యా శాస్త్రం - అంతా ఆ గ్రంథంలో క్రోడీకరించబడి ఉంది. ఈ పుస్తకంలో "పులి-మేక-గడ్డిమేటు పడవలో నదిని దాటడం" వంటి గణిత ప్రహేళికలు వందకి పైగా కనిపిస్తాయి. ప్రతీ ప్రహేళికనీ ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించి చూపుతాడు డయొఫాంటెస్. కాని అదేమి (దుర్)అదృష్టమో కాని ఈ పుస్తకం చదివి గణితం నేర్చుకున్న ఫెర్మాకి ఈ పుస్తకం క్రమబద్ధం చేసిన మంచి అలవాటు అబ్బలేదు. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించే పద్ధతిని ఒక చిన్న కాగితం మీద ముక్తసరిగా మూడు ముక్కలలో సూచించి, దానితో కొన్నాళ్లు చెలగాటాలు ఆడి ఆ కాగితం ముక్కని చెత్త బుట్టలో పడేసేవాడు. అప్పుడప్పుడు, పక్కని కాగితం కనబడకపోతే, ఆ రాయదలుచుకున్నది ఆ పుస్తకం యొక్క ఉపాంతం ("మార్జిన్") లో గొలికేవాడు. ఇలా మార్జిన్ఉపాంతం లో రాసిన ఆణిముత్యాలు ఎన్నో తరవాత తరాలవారికి దొరికేయి.
 
==ఫెర్మా ఆఖరి సిద్ధాంతం==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు