ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==గణితంలో అభిలాష==
పదిహేడవ శతాబ్దపు మొదటి రోజులలో గణిత శాస్త్రం ఇంకా చీకటి యుగంలోనే ఉందనవచ్చు. ఆ రోజులలో గణిత శాస్త్రజ్ఞలకి పెద్దగా పరపతి ఉండేది కాదు. ఏదో అంకెలతో గారడీలు చేసే వాళ్ల కోవలో పరిగణించబడేవారు. [[గెలీలియో గెలీలి|గెలిలియో]] అంతటివాడికి పీసా విశ్వవిద్యాలయంలో గణితం చదవడానికి అవకాశం రాలేదు; ప్రయివేట్లు చెప్పించుకుని నేర్చుకున్నాడు. అంతవరకు ఎందుకు? యూరప్ ఖండం అంతటికీ ఒక్క [[ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం]]లోనే గణితానికి ఒక శాఖ, ఒక పీఠం ఉండేవి.
ఫెర్మా నివసించిన ఊరు పేరిస్ప్యారిస్ కి దూరం కావడంతో పేరిస్ప్యారిస్ నగరంలో ఉన్న కొద్ది పాటి గణిత వేత్తలు (ఉ. పాస్కల్, మెర్సెన్) కూడ అందుబాటులో ఉండేవారు కాదు.
 
ఫెర్మా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన వారిలో ఫాదర్ మెర్సెన్ ఒకరు; ఆయన ప్రాంసులోఫ్రాన్సులో తిరుగుతూ ఫెర్మాని తరచు కలుసునేవారు. ఫెర్మా స్నేహబృందంలో మెర్సెన్ ఒకరైతే "అరిథ్మెటికా" (Arithmetica) అనే పురాతన గ్రీకు గణిత గ్రంథం మరొకటని అభివర్ణించవచ్చు. మెర్సెన్ తో ఇంత పరిచయం ఉన్నప్పటికీ మెర్సెన్ వల్ల పూర్తిగా ప్రభావితుడు కాలేదు ఫెర్మా; తన ధోరణిలో తను సిద్ధాంతాలు - ఋజువులు చూపించకుండా - కాగితాల మీద రాసి వదిలేసేవాడు. "ఋజువేది?" అని అడిగితే "నా బుర్రలో ఉంది" అని సమాధానంసమాధానమిచ్చేవాడు. తను ఆవిష్కరించిన సిద్ధాంతాలు ప్రచురించాలి అని కాని, వాటి వల్ల తనకి పేరు ప్రతిష్ఠలు రావాలని కాని అతనికి ఉండేది కాదు. దీనికి తోడు కొంత చిలిపితనం కూడ ఉండేదేమో అప్పుడప్పుడు తన అనుయాయులని అల్లరి పెట్టే ఉద్దేశంతో సిద్ధాంతం రాసి, ఋజువు చూపించకుండా, "ఇది అవునో కాదో చెప్పుకో చూద్దాం!" అని సవాలు చేసి సమాధానం చెప్పేవాడు కాదు. రెనే డెకా అంతటివాడు ఫెర్మాని "గప్పాల గండడు" అనేవాడు.
 
ఇలా సమస్యని ఇచ్చి పరిష్కారం ఇవ్వకుండా అందరిని ఆటపట్టించడం "పిల్లికి చెలగాటం" లా ఉన్నా ఈ వింత ప్రవర్తనలో కొన్ని లాభాలు కూడా ఉన్నాయనుకోవచ్చు. ఒకటి, ప్రతీ సమస్యకీ పరిష్కారం రాస్తూ కూర్చుంటే బోలెడు సమయం వెచ్చించవలసి ఉంటుంది. ఆ సమయంలో కొత్త సమస్యలు సృష్టించవచ్చు కదా! రెండు, సమస్యలకి పరిష్కారాలు రాసి ఇచ్చేస్తూ ఉంటే తెలిసీ తెలియని ప్రతి అనామకుడూ వచ్చి వాద ప్రతివాదాలలోకి దింపొచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు