వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
:::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి, నమస్కారము. మీ వివరణకు ధన్యవాదములు. ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు, గ్రామాలు వాటిలో ప్రతిదానికి ఒక పేజీ ఉంది మరియు అధిక భాగం వాటికి ఏ మాత్రము చెప్పుకోదగ్గ సమాచారము కూడా లేదు. మరి ఈ వర్గం కూడా ఆంధ్ర_ప్రదేశ్ సమాచార మార్గదర్శిని అవుతుంది కదా ! మీరన్నట్లు, సూచించినట్లుగా ప్రాధాన్యత ఉన్న ఊర్లకు మాత్రమే పేజీలు ఉంటే సరిపోతుంది కదా ! సమాచారం ఉన్న వాటికి మాత్రమే ప్రతి వర్గంలో చాలా పరిమితంగా వ్యాసాలు రాస్తే మంచిది కదా ! ప్రతి గ్రామానికి, సినిమాకి, మనిషికి, ఒకపేజీ వ్యాసం పేరు పెడితే అది విజ్ఞాన సర్వస్వ ఎలా అవుతుందండీ ? పరిమితంగా వ్యాసాలు వ్రాయమనడం వికీ సూత్రాలకు విరుద్ధం కాదా ? మీరు సూచించినట్లు ఏదో ఒక రైలు గురించి వ్రాసి ఊరుకుంటే సరిపోతుందంటారా ? ఒక్కొక్క వికీలో లక్షల్లో వ్యాసాలు ఎలా పుట్టుకొచ్చాయంటారు ? మీ ఆలోచనా కోణం "సమాచార మార్గదర్శిని". నా దృష్టిలో "సమగ్ర వ్యాసదర్శిని". మరి మిగతా వర్గాలలో (ఉదా: సినిమాలు వర్గం, ప్రతి ప్రాజెక్టు కూడా ..) ఒకే విధంగా మీ విధానం పాటిస్తే మంచిది అని నా అభిప్రాయము. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 00:17, 14 ఏప్రిల్ 2016 (UTC)
{{outdent|5}}
[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారికి, వికీపీడియన్లలో పరిమితంగా వ్యాసాలుండాలనే వారు, అపరిమితంగా వ్యాసం వుండవచ్చనే వారు వుంటారు. నా గత చర్చాపేజీల వ్యాఖ్యలు చూస్తే నేను మీకు మొదటి గుంపులోకి చేరినట్లు మీకు తెలుస్తుంది. అయితే ఈ వాదాలకి సందర్భాన్ని బట్టి సముదాయ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటికే గ్రామాల గురించి చాలా చర్చలు జరిగి వాటి ప్రాధాన్యత దృష్ట్యా వ్యాసాలు వుండవచ్చనే నిర్ణయం తెలుగు వికీ విధానమైనదని గత చర్చలు చూస్తే తెలుస్తుంది. ఇక సినిమాల గురించి నేను అంతగా చర్చలలో పాల్గొనలేదు. వెతకలేదు. కాకపోతే ఆంగ్ల వికీపీడియా లాంటి ప్రముఖ వికీపీడియాలలో చాలా చర్చలనంతరం విధానాలు ఏర్పడతాయి కాబట్టి, ఆంగ్ల వికీపీడియాలోని విధానాలను, చిన్ని వికీపీడియాలైన తెలుగు లాంటివి స్వీకరించి పాటించడం మంచిది. సినిమాల వ్యాసాలు ఆ పద్ధతిలో తయారైనవి అని అనుకుంటాను. ఇక ప్రతిరైలుకు ఒక వ్యాసం వుండటం సరియా కాదా అనే దానిగురించి అటువంటి వ్యాసం నాణ్యమైన వ్యాసం కాగలదా అనే కోణంలా ఆలోచించితే సమాధానం దొరకవచ్చు. [[s:పుట:Welcome to Wikipedia brochure EN, for print.pdf/15] ] ప్రకారం ఒక మంచి వ్యాసానికి
* వ్యాసం సంగ్రహరూపం
* విషయం ప్రాధాన్యం తెలిపే కారణాలు