జ్యోతిలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| homepage =
}}
'''జ్యోతిలక్ష్మి''' దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె [[జయమాలిని]] అక్క. ఈమె [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మళయాళ]], [[హిందీ]] భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలో ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.
 
జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్షి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు. ఈమెను చిన్నతనం నుండి [[ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి]] వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. జ్యోతిలక్ష్మికి ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత [[టి.ఆర్.రామన్న]] (పెద్దమ్మ కొడుకు) ఒక ఎం.జీ.ఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించాడు. ఎనిమిదేళ్ళ వయసులో [[శివాజీ గణేశన్]] చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం పెరియ ఇడత్తు పెణ్ తో చిత్రం రంగంలో ప్రవేశించింది. ఈ చిత్రంలో [[నగేష్]] సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించింది. ఈమె చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకుంది.<ref>[http://3.bp.blogspot.com/_vDh6VLh0MwE/TS3ISR0e0UI/AAAAAAAAEhg/Ua2VAkvNc38/s1600/jyotilakshmi.jpeg ఎవర్‌గ్రీన్ ఐటమ్ గర్ల్ అరవైలో ఇరవై - నవ్య డిసెంబర్ 3, 2008]</ref> ఈ నాట్యశిక్షణ సినిమాలో నాట్యాలు చేయటానికి సహకరించింది.
 
తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన [[పెద్దక్కయ్య]].
 
1973లో [[శోభన్ బాబు]] హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మి తిరిగి అదే పాటకు కుబేరులు సినిమాలో నర్తించింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు