జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==సినీ రంగ ప్రవేశము==
ఈవిడ మేనత్త [[టీఆర్‌ రాజకుమారి]] 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’‘[[చంద్రలేఖ]]’ , ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. ఈవిడ మావయ్య టీ ఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు [[టీఏ రామన్‌]] ఈవిడ తల్లి వద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, జయమాలినిని అందులో నటింపజేస్తానని వీళ్ళ అమ్మని అడిగారు. అప్పటికి జయమాలిని వయసు పన్నెండేళ్లు. అదే ఈవిడ తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] ఈమె ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘[[ఆడదాని అదృష్టం]]’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని వీళ్ళ అమ్మని అడిగాడు. అప్పటిలో జయమాలిని చాలాపీలగా వుండడంతో పాటలో నటించేందుకు వీళ్ళ అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకే చెప్పింది. అదే జయమాలిని నటించిన తొలి తెలుగు సినిమా.
 
ఈవిడ [[భరతనాట్యం]] నేర్చుకున్నది. అప్పటికే ఈమె సోదరి [[జ్యోతిలక్ష్మి]] ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే జయమాలిని కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నది. అప్పుడు చాలా చలాకీగా వుండేది. ఆ సమయంలో వీరి ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు [[కె.ఎస్.ఆర్.దాస్]] ఈవిడను చూసి 'ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా' అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో అవకాశాలు కల్పించారు. అలా ఈవిడా చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే విఠలాచార్య ఈవిడకు అవకాశం కల్పించారు.
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు