జట్టిజాం పాటలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం చేర్పు
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
జట్టిజాం పాటలనే కొన్నిప్రాంతాల్లో జక్కీక పాటలంటారు. వెన్నెలరాత్రుల్లో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటే "జట్టిజాము/జక్కీక". జానపద స్త్రీలు వెన్నెలరాత్రుల్లో ఆడే ఆట కాబట్టి జట్టిజాముగా మారిందని "జానపదబ్రహ్మ" [[మునెయ్య]] భావించాడు. (జట్టి అనే మాట యక్ష శబ్దభవమైన జక్కిణి రూపాంతరం కావచ్చు). ఈ క్రీడకు ఎలాంటి వాయిద్యాలుండవు. చేతి చరుపులు, కరకంకణ నిక్వాణాలే వారి పాటలకు వాయిద్యాలు. పెన్నుద్దికత్తె పాట పాడగా మిగతా ఉద్దులు ఆ పాట అందుకుని పాడతారు. యుగళగీతాలు ఉద్దులు ఉద్దులుగా పాడుకుంటారు. జట్టిజాంలో భక్తిరసప్రధానమైన గేయాలే కాక హాస్య, శృంగార, పురాణ వీరరస గేయాలు కూడా చోటు చేసుకున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/జట్టిజాం_పాటలు" నుండి వెలికితీశారు