శివసాగర్ రాంగులామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
స్వాతంత్ర స్థితిగతులు ఏర్పడుతూండగా 1961లోనే శివసాగర్ మారిషస్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిలో 1968 వరకూ కొనసాగారు. దేశంలోని అన్ని వర్గాలను సమీకరించి అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారన్న నమ్మకాన్ని కలోనియల్ ఆఫీస్ ఆయనపై పెట్టుకుంది, ఆ క్రమంలోనే [[1965]]లో నైట్ హుడ్ గౌరవాన్ని పొందారు. 1968లో మారిషస్ కు స్వాతంత్రం వచ్చాకా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. [[1968]] నుంచి [[1982]] వరకూ వరుస ఎన్నికలను ఎదుర్కొంటూ సంకీర్ణ ప్రభుత్వాలను నిలబెట్టుకుని ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగారు. 1982 సాధారణ ఎన్నికల్లో మారిషస్ మిలిటెంట్ మూమెంట్ (ఎంఎంఎం) భాగస్వామ్య పక్షాల చేతిలో ఓటమించెందారు. స్వయంగా శివసాగర్ రాంగులామ్ పార్లమెంట్ సీటు కోల్పోయారు. మిలిటెంట్ సోషలిస్ట్ మూమెంట్ పార్టీకి చెందిన అనిరూధ్ జగ్నాథ్ ప్రధాని అయ్యారు, కానీ కొద్దికాలానికే చీలికలు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. శివసాగర్ రాంగులామ్ తన పార్టీ జగ్నాథ్ యొక్క మిలిటెంట్ మూమెంట్ పార్టీని సమర్థించారు. జగ్నాథ్ ఎన్నికై ప్రధాని కావడంతో శివసాగర్ సహకారానికి ఫలితంగా ఆయనను గవర్నర్ జనరల్ గా నియమించారు. గవర్నర్ జనరల్ పదవిలో ఆయన 1985లో మరణించేంతవరకూ కొనసాగారు.
== మరణం ==
మారిషస్ గవర్నర్ జనరల్ గా ఉండగా [[1985]]లో అధికారిక నివాసంలోనే శివసాగర్ రాంగులామ్ మరణించారు. ఆపైన కొన్నేళ్ళకు శివసాగర్ కుమారుడు నవీన్ రాంగులామ్ లేబర్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. నవీన్ 1995లోనూ, 2005లోనూ రెండుమార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి దాదాపుగా 15 సంవత్సరాలు మారిషస్ ను పరిపాలించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_రాంగులామ్" నుండి వెలికితీశారు