పసల అంజలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
== కారాగారవాసం ==
1930లో ఉప్పు సత్యాగ్రహంలో [[భీమవరం]] లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు చేస్తున్న అంజలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. 1931 జనవరి 20న ఆరు నెలల కారాగార శిక్ష విధించి మదరాసు, వెల్లూరు జైళ్ళకు తరలించారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల శిక్షాకాలం ముగియకుండానే 1931 మార్చి 7న విడుదలయ్యారు. 1932 జూన్ 27న ప్రభుత్వశాసనాల్ని ఉల్లంఘిస్తూ భీమవరం తాలూకా కాంగ్రెస్ సమావేశాన్ని పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఈ సమావేశం జరగకుండా భీమవరంతోపాటు, మార్గాలలో కూడా పోలీసు బలగాల్ని మోహరిం చింది. కాంగ్రెస్ సత్యాగ్రహులు, అంజలక్ష్మి తది తరులు చేల గట్ల వెంట రహస్యంగా సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం భర్త కృష్ణమూర్తితో కలిసి తాలూకా ఆఫీసు భవనం పెకైక్కి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశా రు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి ఈ సాహసోపేత కార్యక్రమంలో పాల్గొనటం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్ని సంబ్రమాశ్చర్యంలో ముం చెత్తింది. ఆంగ్ల పతాకాన్ని తొలగించి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనత ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా అంజలక్ష్మి దంపతులకే దక్కింది. ఇంతలో పోలీసులు లాఠీచార్జి జరిపి, వారిని అరెస్టు చేసి భీమవరం స్పెషల్ మెజిస్ట్ట్రేటు కోర్టులో హాజరుపర్చారు. 1931 జూన్ 27 నుంచి పది నెలల కారాగార శిక్ష విధించారు. ఐదేళ్ల కుమారుడు ఆదినారాయణతోపాటు ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి వెల్లూరు, కన్ననూరు కారాగారాల్లో శిక్ష అనుభవించారు.
 
1931 అక్టోబరు 29న వెల్లూరు జైల్లో అంజలక్ష్మి కుమార్తెను ప్రసవించింది. ‘కృష్ణుడి వలే జైలులో జన్మించడం వల్ల కృష్ణ అని, భరతమాత దాస్యవిముక్తి పోరాటంలో జన్మించడం వల్ల భారతి అని కలిసేలా కృష్ణభారతిగా నామకరణం చేసిన దేశభక్తురాలు అంజలక్ష్మి. ఆరు నెలల బిడ్డతో 26 ఏప్రిల్ 1933న అంజలక్ష్మి కన్ననూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రదేశంలోని స్ర్తీలోకం అంజలక్ష్మికి నీరాజనాలు పట్టింది. అప్పటి నుంచి అంజలక్ష్మి మాంసాహారాన్ని విసర్జించి, జీవితాంతం శాఖాహారిగానే జీవించారు.
 
== సంఘ సంస్కరణ ==
ఆదర్శ వివాహాలను, వితంతు వివాహాలను దగ్గరుండి జరిపించి, ఆ జంట మనుగడకై కొంత ధనాన్ని సహాయంగా ఇచ్చారు. ఆస్తినంతా దాన ధర్మాలకు సంఘ సంస్కరణ ఉద్యమాలకు ఆనందంగా ఖర్చు చేశారు.
"https://te.wikipedia.org/wiki/పసల_అంజలక్ష్మి" నుండి వెలికితీశారు