విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
ఎంతో లలితమైన కథావస్తువుతో, ఆ కాలానికి తగినట్టు ప్రత్యేక రచనతో పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు తీర్చిదిద్దడం పాఠకుల్ని విడువక చదివించిందని రచయిత, విమర్శకుడు వి.రాజారామమోహనరావు పేర్కొన్నారు. రచనాపరంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబించారు. పాఠకులకు తిరిగి చెప్పదలచుకున్న అంశాలను, అంతకుముందే జరిగిపోయినా తిరిగి ప్రస్తావించారు. నవలలోని వర్ణనలు, చాలాచోట్ల వాతావరణ విశదీకరనకే కాక, పాత్రల మనస్థితిని తెలిపేలా తీర్చిదిద్దారు.<ref>వి.రాజారామమోహనరావు రచించిన "నవలాహృదయం"లో విశాల నేత్రాలు వ్యాసం; పేజీ.54 </ref>
 
== పుస్తక రూపకల్పన ==
== ఉదాహరణలు ==
== ప్రాధాన్యత ==
నవలలు పత్రికల్లో ధారావాహికలుగా ప్రచురితమై ప్రజాదరణ సంపాదించిన రోజులకు నాంది పలికిన నవలల్లో ఒకటిగా విశాల నేత్రాలు ప్రాధాన్యత సంతరించుకుంది. పత్రికలో బాపుబొమ్మలతో వెలువడిన ఈ నవల వల్ల సాహిత్యానికి చిత్రాలు ఎంత ప్రయోజనకరమో పాఠకుల స్పందన ద్వారానే తెలిసింది. ఈ నేపథ్యంలో పత్రికల్లో ప్రచురితమయ్యే నవలలకు, కథలకు భావస్ఫోరకమైన చిత్రాలు ఉండేలా చూసుకోవడం ప్రారంభించారు.<br />
Line 55 ⟶ 53:
ఈ నవల ధారావాహికగా వెలువడే రోజుల్లో వారం వారం పత్రిక కోసం పాఠకులు ఆత్రుతగా ఎదురుచూసేవారని పలువురు సాహిత్య విమర్శకులు పేర్కొన్నారు. గణపతిశాస్త్రి కూర్చిన అనేక రకాల వర్ణనలను, సౌందర్య వివరాలను అపురూపమైన చిత్రాలుగా బాపు మలిచేవారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా నవల పాఠకలోకంలో ఒక సంచలనంగా నిలిచింది. అనంతర కాలంలో పుస్తకరూపాన్ని సంతరించుకున్న విశాల నేత్రాలు పలుమార్లు పునర్ముద్రితమైంది.<br />
ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2003 ప్రాంతాలలో "ధనుర్దాసు" అన్న పేరుతో దూరదర్శన్ ఈ నవలను చిత్రీకరించి ప్రసారం చేశారు. ఈ నవలను సినిమాగా తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగాయి. ప్రముఖ సినీనటుడు, నిర్మాత ఉప్పలపాటి కృష్ణంరాజు పలుమార్లు విశాల నేత్రాలు చిత్రంగా తీయడం తన కల అంటూ పేర్కొన్నారు. ఆయన సినిమాకు అనుగుణంగా పూర్తిస్థాయి స్క్రిప్టు రాయించుకుని, ప్రభాస్ కథానాయకునిగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కారణాంతరాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. "విశాలమైన నేత్రాలతో గణపతిశాస్త్రి వర్ణనలకు తగ్గ కథానాయిక దొరకక ఈ కథ చిత్రరూపం దాల్చలేదని" పలు ముఖాముఖీల్లో పాల్గొన్న ఆయన త్వరలోనే విశాలనేత్రాలు సినిమాగా వస్తుందని కూడా చెప్తున్నారు.<ref>[http://archive.andhrabhoomi.net/specials/Vennela%20-%20interviews/content/avineethi]కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref><ref>[http://teluggodu.blogspot.in/2012/01/blog-post_8194.html]2012 జనవరిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref>
 
== బయటి లింకులు ==
[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Visaala%20Netraalu&author1=Sri%20P%20Ganapati%20Sastri&subject1=THE%20ARTS&year=1963&language1=telugu&pages=364&barcode=2990100071745&publisher1=Prem%20Chand%20Publications%20Vijayawada&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Saraswata%20Vidya%20Nikethanam%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-01&rights1=&format1=Tagged%20Image%20File%20Format&url=/data_copy/upload/0071/750%20target= డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గ్రంథ ప్రతి]
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు