విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
[[File:Famous ganta stambham vizianagaram.jpg|thumb|240px|ప్రముఖ కూడలి గంటస్తంభం]]
 
==చరిత్ర==
విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, '''''బొంకులదిబ్బ''''' మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత [[గురజాడ అప్పారావు]] విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.
 
==విజయనగర వైభవం==
===పైడితల్లి అమ్మవారి ఆలయం===
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి [[సిరిమాను|సిరిమానోత్సవాలు]] విజయనగరం పట్టణంలో ''300 ఏళ్లు''గా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను '''భక్తి'''తో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
 
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే '''పైడిమాంబ''' విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే ''అమ్మవారి'' [[తెప్పోత్సవం]] నిర్వహిస్తారు.
 
===గంట స్థంభం కూడలి===
విద్యుశ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు 'మూడు లాంతర్లు కూడలి' లో మూడు వైపులా మూడు హరికెన్ [[లాంతర్లు]] ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు 'అవృతఖానా' ను పెద్ద పూలకోటలో నిర్మించారు. 'ఖానా' అంటే మదుము అని 'అవృత' అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. 'నీరు బయటకు పోయే మదుము' అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉన్నది. పైభాగంలో స్నానానికి అనువుగా ''పెద్ద తొట్టె'' ఉన్నది. క్రిందిభాగంలో [[నుయ్యి]], దిగడానికి మెట్లు వున్నాయి. మహారాజులు ఇందులో '''స్నానాలు''' చేసేవారని పెద్దలు అంటారు.
 
===రాజావారి కోట===
 
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని 'బొంకుల దిబ్బ' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. 'బంకు' అనేది మహారాష్ట్ర పదం దీనికి 'తలవాకిట పహరా' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ''ఇంజినీరు'' పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు