వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
::[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారు ఎవరైనా ఏదైనా చెపితే నాకెందుకు చెపుతున్నారు అని వాళ్ళకు బదులివ్వడంలో అసహనం వ్యక్తం చేయడం ఎందుకు. ఎందుకు చెపుతున్నారో ఒకసారి గ్రహించి వారి సలహాలు స్వీకరించడం వికీనియమం. దానిని వదిలి ఇక్కడ కాకపోతే మరోచోట అనుకోవడం అంత మంచిది కాదు. ఆ మరోచోటా ఇలానే ఉంటుంది. రాజీ ఎక్కడైనా అవసరమే. ఎవరు చెప్పినా వారి స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు. ఎవరూ ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ రాయలేదు. వాళ్ళిస్టం, ఎప్పుడైనా వస్తారు ఏదైనా రాస్తారు. ఇంతకాలం రాయలేదు కాబట్టీ నువ్వెవరు అనే అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు. మీరు పెద్దవారు అయినా లేదా వయసు బట్టి అయినా ఎక్కువగా రాస్తున్నారనో ఇక్కడ హెచ్చుతగ్గులు ఉండవు. ఒక్క మార్పు చేసిన వాళ్ళకూ లక్ష మార్పులు చేసినవాళ్ళకూ అదే అధికారం ఉంది. మీ రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చెస్తున్నారు. మీరే గనక వికీసోర్స్ మార్పులు చేయతలపెడితే అద్భుతంగా ఉంటుంది. దయచేసి గ్రహించండి. దీనిపై నేను చర్చలు చేయను. మీ విజ్నత, మీ వయసు బట్టి మీరే నిర్ణయిచుకోవాలి....--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 12:28, 24 ఏప్రిల్ 2016 (UTC)
** :[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] గారు,
(1) మీ వాక్యం: ఎవరైనా ఏదైనా చెపితే నాకెందుకు చెపుతున్నారు అని వాళ్ళకు బదులివ్వడంలో అసహనం వ్యక్తం చేయడం ఎందుకు. ఎందుకు చెపుతున్నారో ఒకసారి గ్రహించి వారి సలహాలు స్వీకరించడం వికీనియమం.
జవాబు: నాకు అసహనం లేదు. ఎవరైనా ఏం సలహాలు, సూచనలు చేశారో సూటిగా మీకు అర్థమయినది చెప్పండి. ఎవరైనా పేరాలు పేరాలు వ్రాస్తారు, అందులో ఏముందో ఒకసారి చదివి మీరు నాకు ఎటువంటి సలహాలు ఇచ్చారో చెప్పండి ?
 
(2) మీ వాక్యం: ఇక్కడ కాకపోతే మరోచోట అనుకోవడం అంత మంచిది కాదు. ఆ మరోచోటా ఇలానే ఉంటుంది.
జవాబు: నాకు ఎక్కడా కూడా వ్యతిరేక ధోరణి లేదా ఇక్కడ వాళ్ళ కొందరిలా ఉపయోగపడని చర్చలు లేవు. మీరనుకున్నట్లు, ఊహించినట్లు అయితే నిజ జీవితంలో కూడా సమస్యలు సుడిగుండాలుండేవి. నాకు అటువంటివి లేవు. తదుపరి మీకు తెలుసో లేదో, ఒకనాడు అర్జున గారు, రాజశేఖర్ గారు, మరికొంత మంది కొత్త ఆలోచన మార్పులు చేపట్టేందుకు వికీలో వేలు పెట్టడానికి భయపడేవారనేది వాస్తవం. వ్యక్తిగతంగా రోజులు తరబడి చర్చలు చేసుకునే వాళ్ళము. ఆ నాడు మరి నేను మంచి పనులు కోసం మరింత ఉత్సాహం ఇచ్చి నేను ఉన్నాను అని అందరినీ ప్రోత్సహించే వాడిని. ఆ రోజులు మరచిపోతే ఏం చెప్తాం ? మరి ఆనాడు నేను నా పద్ధతి బావుండి ఇప్పుడు ఎందుకు బావుండ లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థమా ?
 
(3) మీ వాక్యం: ఎవరు చెప్పినా వారి స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు. ఎవరూ ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ రాయలేదు. వాళ్ళిస్టం, ఎప్పుడైనా వస్తారు ఏదైనా రాస్తారు. ఇంతకాలం రాయలేదు కాబట్టీ నువ్వెవరు అనే అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు.
జవాబు: నేను పని చేసిది కూడా స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు అని చెప్పేవాళ్ళు గ్రహించాలి. మూలాలు సరిఅయినవి కావు. స్పాములు అని ఏవో సాంకేతికంగా నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను అన్నవి కాదా ? ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ ఎవరూ కూడా రాయలేదు. కానీ రోజులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వికీతో మరియు వాడుకరులతో మార్పుల చేర్పుల అవగాహన ఉన్నవారికి వాస్తవ విషయాలు అర్థం అవుతాయి. ఎప్పుడైనా వస్తారు, ఏదైనా రాస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది అని అంటూనే నా దగ్గర వచ్చే సరికి ఈ సూత్రం వర్తించదా ? అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు అంటూనే నన్ను వ్రాయవద్దు అనే అధికారం నాకు సలహాలు ఇచ్చేవారికే ఉందా ? నేను '''ఎవరినీ నువ్వు ఎవరూ''' అని పాత వారిని సంబోధించలేదు. ఆ పదాన్ని వెనుకకు తీసుకోవటం మంచిది.
 
(4) మీ వాక్యం: ఒక్క మార్పు చేసిన వాళ్ళకూ లక్ష మార్పులు చేసినవాళ్ళకూ అదే అధికారం ఉంది.
జవాబు: ఇల్లాంటి వాక్యాలు మీతో చెప్పించుకునే స్థితి పరిస్థితిలో నేను ఉన్నానా ? ఒకసారి ఆలోచించి చెబితే బావుంటుంది.
 
(5) మీ వాక్యం: మీ రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చెస్తున్నారు.
జవాబు: మీ వాక్యాల్లో ముఖ్యమైనది ఇది మాత్రమే. రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చేస్తున్నారు. చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా మాట్లాడతారు. దీని గురించి చర్చలు చేయండి. సలహాలు, సూచనలు సవ్యంగా ఇవ్వండి. నిజంగా ఆ అసహనాలు ఏమిటో త్వరలో ఇప్పుడే తెలిసిన వివరాలు వెంటనే తెలియజేయండి. వాటిని నివృత్తి చేస్తాను. చివరగా, కుదరకపోతే వ్యాసాలు అన్నీ నేనే తొలగిస్తాను. ఇంతకంటే ఏం చెప్పాలి ?
 
(5) మీ వాక్యం: దీనిపై నేను చర్చలు చేయను.
జవాబు: వ్రాసినదంతా వ్రాసి చర్చలు చేయను అని అంటే ఎలాగండీ ? ప్రతి వాళ్ళ జీవితం, వ్యక్తిత్వంలో మాటలతో మారిపోతుందని నేను అనుకోను. ఎవరి పద్దతి జీవితం వారిది. నేను ఎవరికీ భజనలు చేయను. అలాంటి అలవాటు నాకు ఎక్కడా లేదు. నాకు పని చేయడం, చేయించడం మాత్రమే తెలుసును. నేను మాత్రం మనిషి మనిషికి నా పద్దతి మార్చుకోను. చేతనయితే చర్చలు చేయండి. ఊహాగానాలు, భ్రమలు నాకు మాత్రము చెప్పకండి.
చివరగా: నాకు ఎవరు, ఎందుకు, ఎలా, ఏం చెబుతున్నారో అర్థం చేసుకోలేని అవివేక మానసిక స్థితితో అయోమయంగా జీవితాన్ని గడిపే రోజులతో అటువంటి పరిస్థితులలో నేను లేనని మాత్రం గ్రహించండి. మీ సలహాలు, సూచనలు, ఇంకా ఏమైనా ఉంటే అన్నింటికీ ధన్యవాదములు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:11, 24 ఏప్రిల్ 2016 (UTC)
 
==నా పోస్టింగులు ముద్రణ ఆపారు==