మొక్కపాటి నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1973 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''మొక్కపాటి నరసింహశాస్త్రి''' (1892-1973) సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత.<ref>{{cite book | title = Encyclopaedia of Indian literature vol. | publisher = [[Sahitya Akademi]] | year = 1987 | url = http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA391&lpg=PA391&dq=%22mokkapati+narasimha+sastry%22&source=web&ots=mTI0YByQs2&sig=pQ4p5bnSk4P9HN7ZvrEKhBwbzeo | accessdate = 2007-12-08 }}</ref>
 
[[1925]] లో ప్రచురితమైన ఇతని [[బారిష్టర్ పార్వతీశం (నవల)|బారిష్టర్ పార్వతీశం]] అన్న [[నవల]] తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. ''బారిష్టర్ పార్వతీశం'' హాస్యానికి పెట్టింది పేరు.

ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.
==బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం==
ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల [[స్కాట్‌లాండ్]] లో [[ఎడిన్‌బరా]] నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టు గా చేరుతాడు. ఒక లా కళాశాల లో చేరుతాడు. ఆంగ్లం కూడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడంతో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగంలో తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకంలో బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.
 
==బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం==
మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.
 
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.