తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
[[File:Betel Plant.JPG|thumb|తమలపాకు]]
==తుని తమలపాకు==
ఆంధ్ర దేశంలో [[తుని]] తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరం లో ఎన్నో తమలపాకు టోటలుతోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి.
 
==హిందూ మతంలో తమలపాకులు==
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు