లింగమంతుల స్వామి జాతర: కూర్పుల మధ్య తేడాలు

389 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:జాతరలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
'''లింగమంతుల స్వామి జాతర''' [[తెలంగాణ]]లో రెండో అతి పెద్ద జాతర.
==విశేషాలు==
[[నల్గొండ జిల్లా|నల్లొండ జిల్లా]] లోని [[చివ్వెంల|చివ్వెంల మండలం]] [[దురజ్‌పల్లి|దురాజ్ పల్లి]]<nowiki/> లో [[యాదవ|యాదవు]]<nowiki/> ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. [[తెలంగాణ]] రాష్ట్రంలో [[సమ్మక్క సారక్క జాతర|సమ్మక్క సారలమ్మ]] జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నల్లొండ జిల్లా [[దురజ్‌పల్లి|దురాజ్ పల్లి]]<nowiki/>లో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]], ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.<ref>[http://www.sakalam.com/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82/ లింగమంతుల జాతర ప్రారంభం]</ref>
 
లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలుపట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఓలింగా... ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు.
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* http://www.thehindu.com/news/national/telangana/divine-box-holds-key-to-peddagattu-jatara/article6873161.ece
 
[[వర్గం:జాతరలు]]
1,35,013

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1870512" నుండి వెలికితీశారు