వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 392:
:[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారికి నమస్కారం. మీకు రైల్వేల మీద ఉన్న అనుభవం వలన ఈ వ్యాసాలను ఒక ప్రాజెక్టుగా అనుకొని రాస్తుండవచ్చు. అయితే వీటి పై తగినంతమంది స్పందిచకపోవుటచేత ..దానికై నేను ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాను.
భారతీయ రైల్వేలలో ప్రతి రైలుకు ఒకవ్యాసం ఉండవచ్చా లేదా అనేదానిపై సభ్యులు తెలిపిన అభిప్రాయాలపై తదుపరి ప్రసాద్ గారు తమ వ్యాసరూపాల తీరు తెన్నులను మార్చుకొంటారు. తెవికీ మెరుగునకై ప్రతివారూ తమ అభిప్రాయాలను,అందిచి ప్రసాద్ గారి ప్రాజెక్టును అందంగా మల్చేందుకుకృషి చేస్తారని నా మనవి...--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 13:07, 27 ఏప్రిల్ 2016 (UTC)
:::[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] గారు, మీ చర్చలు ఓ కొలిక్కి వచ్చేవరకు నేను ప్రస్తుతం రైల్వే వ్యాసాలు వ్రాయడం విరమించుకుంటున్నాను. అందరి అభిప్రాయాలు నేను మొదలు పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఏకాభిప్రాయంతో ఉన్నారేమో అని భ్రమపడ్డాను. కాని ఎవరూ ఏ అభిప్రాయముతో ఇద్దమిద్దముగా స్థిరముగా లేరని ఇప్పుడే తెలుస్తోంది. నేను అందుకే జాబితాలు వ్రాసాను, వ్యాసలలో పెట్టాను, మూసలు జాబితాలకు కట్టాను, ఇలా ఎన్నో విధములుగా ఇతరులకొరకు విన్యాసములు చేయవలసి వచ్చింది. ఎవరైనా స్పందిస్తారేమో అనుకున్నాను. ఈ నాటి వరకు నాతో అనవసర చర్చలు చేశారే కాని, సరి అయిన నిర్ణయాలతో నాకు సలహాలు, సూచనలు వచ్చినవి చాలా తక్కువ. అందుకని నేను ఇంక నుండి కొంతకాలము రైల్వే వ్యాసములు వ్రాయను. ఇంకనుండి ఎవరికిష్టమయిన రీతిలో వారు వ్యాసములు తొలగించి, కొత్త పంథాలో కూడా వ్రాసుకోవచ్చును. సరి అయిన సూచనలు, సలహాలు ఇతరులు ఇవ్వక అనవసర చర్చల వలన నాకు కొంత ఆసక్తి, ఉత్సాహం తగ్గిన మాట వాస్తవం. మళ్ళీ మీ అభిప్రాయాలకు అనుగుణంగా చర్చలు పూర్తి అయ్యాక వ్రాయాలనిపిస్తే వ్రాస్తాను. ఈలోపున తొలగించుకోవాలనుకున్న వ్యాసములు తొలగించ వచ్చును. మీ అందరికీ ధన్యవాదములు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 17:37, 27 ఏప్రిల్ 2016 (UTC)
 
==="ప్రతి రైలుకు ఒకవ్యాసం అవసరం" పై మీ అభిప్రాయం లేదా సంతకం===
# ప్రతి రైలుకు ఒక వ్యాసం ఉండవచ్చును (కొన్ని వికీ నియమాలను అనుసరించి) అనేది నా అభిప్రాయం. ఎంతోమంది ప్రజలను వారి గమ్యస్థానానికి చేరుస్తున్న రైలు బండ్ల గురించి వ్రాయాల్సినది చాలా ఉంటుంది. రైలు నంబరు, రకం, పేరు, ఆగే స్టేషన్లు సమయాలు వాటి వివరాలు, సంబంధించిన లింకులు అన్నీ చేర్చవచ్చును. అలాగే ఆ రైలులోని భోగీలు, నడిపిస్తున్న ఇంజను, సిబ్బంది కూడా చేర్చవచ్చును. ఎక్స్ ప్రెస్ రైలు కన్నా పాసింజర్ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగుతుంది; కాబట్టి ఆయా స్టేషన్లకు లింకు చేర్చవచ్చును (ఊర్లకు కాదు). ఇందులో కొన్ని సమాచారపెట్టెలో చేర్చితే సరిపోతుంది; ఒక్కొక్క వివరానికి ముఖ్యపేజీలో ఒక విభాగము అవసరం లేదు. చరిత్ర అవసరం. కానీ అస్సలు నచ్చని విషయాలు కొన్ని: 1. విశాఖపట్నం నుండి హైదరాబాదుకు నడుస్తున్న రైలు మరియు హైదరాబాదు నుండి విశాఖపట్నంకు నడుస్తున్న రైలు అనేదానికి ఒక వ్యాసం సరిపోతుంది. రెండు వ్యాసాలు అవసరం లేదు. 2. అలాగే రైలు బొమ్మలు thumbnail సరిపోతుంది. 3. ప్రతి స్టేషన్లో ఆగే సమయాల పట్టిక కాకుండా స్టేషన్ల పేర్లు జాబితా రూపంలో సరిపోతుంది (లింకులతో), సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ స్టేషన్లు సాధారణంగా మారవు. 4. రైళ్ల పేర్లు చాలా తికమకగా ఉన్నాయి కాబట్టి ముందుగా నామకరణం చేయబడిన రైళ్లను అభివృద్ధి చేసి అనామిక బండ్లను గురించి తర్వాత తయారుచేయవచ్చును. ఉదా: హైదరాబాద్ - విశాఖపట్నం రైలు కన్నా గోదావరి ఎక్స్ ప్రెస్ అని ఉంటే బాగుంటుంది. 5. ప్రతి వ్యాసంలో ఆయా స్టేషన్ల మధ్య నడిచే అన్ని రైళ్ల జాబితా అవసరం లేదు; ఆ జాబితా లింకును ప్రతి రైలుబండి వ్యాసంలో ఇవ్వవచ్చును. అందరికీ నచ్చే విధంగా ఒక రైలుబండి వ్యాసాన్ని నమూనా వ్యాసంగా ఎవరైనా తయారుచేసి చూపిస్తే అది ప్రసాద్ గారికే కాకుండా నాలాంటి వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 13:48, 27 ఏప్రిల్ 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు