గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 73:
అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రధ సారధి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ(మహాభినిష్క్రమణ) (ది గ్రేట్ డిపార్చర్) అని అంటారు.
 
సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగహరాజగృహ(మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం)లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.
 
తర్వాత సిద్ధార్దుడు, రాజగహనురాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.
 
తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేశేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్దుడు, నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు