రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →ప్రదర్శనలు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →ప్రదర్శనలు |
||
పంక్తి 18:
== ప్రదర్శనలు ==
సందర్శకుల కొరకు నిర్వహిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీకునడానికి అనువుగా ఎర్పాట్లు చేసి ఉన్నారు. బహిరంగంగా కొందరు అప్పుడప్పుడూ ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. సందర్శకులు ఆ ప్రదర్శనలను చూసి ఆనందిస్తుంటారు. తరువాత రియల్ స్టంట్, స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి షోలను క్యూలో వెళ్ళి చూడవచ్చు. రియల్ స్టంటు కళాకారులు కృత్రిమ స్టంట్ ప్రదర్శనను ఇస్తూంటారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. దృశ్యచిత్రీకరణ ప్రదర్శనలో ముందుగా సందర్శకులను ఒక చిన్న హాలులో గుమి కూడేలా చేస్తారు. అక్కడ సందర్శకులలో నుండి ఒక జంటను పిలిచి వారిని హీరో హీరోయిన్లగా ప్రకటిస్తారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను కొన్ని ద్వారాలను తెరిచి వాటి ద్వారా వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ఔట్ డోర్ దృశ్యాలను చిత్రీకరించడానికి కొన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి. జరగబోయే కార్యక్రమాలను నిర్వాహకులు సందర్శకులకు వివరించి ముందుగా ఎన్నుకున్న జంట చేత ఒక లఘు దృశ్యంలో నటింపచేస్తారు. ఆదృశ్యాలను తెర మీద చూపుతారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ముందుగా చిత్రించిన దృశ్యాలకు డబ్బింగ్ జత చేస్తారు. డబ్బింగ్ సహాయం ప్రేక్షకుల నుండి ఉత్సాహ వంతులైన వారిని తీసుకుని చేస్తారు. తరువాత ఆదృశ్యాలను ప్రేక్షకులకు చూపి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ప్రేక్షకులకు చిత్రీకరించిన దృశ్యానికి వేరొక చోట చిత్రీకరించిన ఔట్ డోర్ దృస్యాలను మరి కొన్నింటిని అవసరమైన మేరకు జత చేర్చి చూపుతారు. ఇలా సందర్శకులకు చిత్రీకరణ దహస్యాలను ప్రత్యక్షంగా చూపడమే కాక వాటిలో ఉన్న శ్రమను కొంత హాశ్యాన్ని జత చేసి అవగాహన కలుగచేస్తారు. ఇంతటితో ఈ ప్రదర్శన పూర్తి అయినట్లే. సందర్శకులు రామోజీ టవర్స్ భవనంలో నిర్వహించే ప్రదర్శన కొరకు సందర్శకులు క్యూలో నిలిచి వచ్చి చేరుకుంటారు. అక్కడ నుండి సందర్శకులను చిన్న ట్రాలీ వంటి వాహనాలలో ఎక్కించి తరువాత సీటు నుండి కదలకుండా ఏర్పాటు చేసి రైడ్‌కు తీసుకు వెడతారు. సందర్శకులు ట్రాలీలో కూర్చుని ప్రయాణం చేస్తూ ఇరువైపులా బొమ్మల కదలికతో ఏర్పాటు చేసిన చక్కని దృశ్యాలను చూడ వచ్చు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన మందమైన కాంతిలో కదిలే బొమ్మలు వివిధ దృశ్యాల రూపంలో సందర్శకులను ఆకర్షిస్తాయి.
== చిత్రీకరణకు ఉపయోగపడే లొకేషన్స్, పూతోటలు, ఇతరాలు ==
|