ఇందిరా గాంధీ హత్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[అక్టోబరు 31]] [[1984]] న సుమారు 9:20 కు ఐరిష్ టెలివిజన్ కొరకు డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటిష్ నటుడు "పీటర్ ఉస్తినోవ్" కు ఇంటర్వ్యూ యిచ్చుటకు వెళ్ళవలసి ఉంది. ఆ సందర్భంలో ఆమె తన యింటి ఉద్యానవనం గుండా నడుచుకుంటూ యింటి సమీపం లో గల అక్బర్ రోడ్డు అఫీసుకు వెళ్ళుచున్నది.<ref name=cnn>{{cite web |title=25 years after Indira Gandhi's assassination |url=http://ibnlive.in.com/news/india-and-indira-25-years-after-a-pms-assassination/104183-37.html |date=30 October 2009 |publisher=[[CNN-IBN]]}}</ref>
 
ఆమె తన వికెట్ గేట్ వద్దకు వచ్చేసరికి అక్కడ కాపలాగా ఉన్న సత్వంత్‌సింగ్ మరియు బియాంత్ సింగ్ లు కాల్పులు జరిపారు. సబ్‌ఇనస్పెక్టరు అయిన బియాంత్ సింగ్ మూడు రౌండ్లు కాల్పులు ఉదరంలోకి జరిపాడు.<ref name=smith>{{cite news |last=Smith |first=William E. |title=Indira Gandhi's assassination sparks a fearful round of sectarian violence |url=http://www.sikhtimes.com/bios_111284a.html |accessdate=19 January 2013 |newspaper=Time |date=12 November 1984}}</ref> వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తో 30 రౌండ్ల కాల్పులను ఆమె నేలకూలే వరకు కాల్చాడు.<ref name=smith/> కాల్పుల అనంతరం ఇద్దరూ వారి ఆయుధాలను నేలపైకి విసిరి వేసారు. బియాంట్ సింగ్ "నేను ఏది చేయాలనుకున్నానో అది చేసాను. నీవు ఏమి చేయాలనుకున్నావో అది చేసావు" అని అన్నాడు. తరువాతి ఆరు నిమిషాలలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసుకు సంబంధించిన సైనికులైన తార్సెమ్‌సింగ్ జమ్వాల్ మరియు రామ్‌శరణ్ లు వారిని పట్టుకొని బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. బియాంత్ సింగ్ ఆ గదిలో ఉన్న అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినందుకు గానూ అతనిని కాల్చి చంపారు. సత్వంత్ సింగ్ ఇందిరాగాంధీ యొక్క యితర అంగరక్షకునిచే అరెస్టు కాబడినాడు.<ref name=tdaily>{{cite news |title=Questions still surround Gandhi assassination |url=https://news.google.com/newspapers?id=w1seAAAAIBAJ&sjid=BMgEAAAAIBAJ&pg=1354,5824409&dq=assassination+of+indira+gandhi&hl=en |accessdate=19 January 2013 |newspaper=Times Daily |date=24 November 1984 |agency=AP |location=New Delhi}}</ref> సత్వంత్ సింగ్ తన తోడు దొంగ అయిన కేహార్ సింగ్ తో సహా 1989లో ఉరి తీయబడ్డాడు.<ref>Dr. Sangat Kr. Singh, The Sikhs in History, p. 393</ref> ఈ హత్య గురించి ఆమె కాల్చబడిన 10 గంటల తరువాత [[అక్టోబరు 31]] [[1984]] న సాయంత్రం దూరదర్శన్ వార్తలలో మొదటి సారి సల్మా సుల్తాన్ మొదటి వార్తను వెలువరించారు.<ref>{{cite web|url=http://www.indianexpress.com/news/the-riots-that-could-not-be-televised/536471/ |title=The riots that could not be televised |publisher=Indianexpress.com |date=2009-11-03 |accessdate=2015-03-31}}</ref><ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/We+the+eyeballs/1/1328.html |title=We the eyeballs : Cover Story - India Today |publisher=Indiatoday.intoday.in |date= |accessdate=2015-03-31}}</ref> ఇందిరాగాంధీకి తన భద్రతా సిబ్బందిచే హత్య గావింబబడవచ్చని ఇంటెలిజన్స్ అధికారులు తెలియజేసినప్పటికీ ఆమె వ్యక్తిగత కార్యదర్శి అయిన ఆర్.కె.థావన్ పెడచెవిన పెట్టాడని ఆరోపించబడ్డారు.<ref>{{cite news| url=http://www.nytimes.com/1989/03/28/world/india-releases-stinging-report-on-gandhi-s-death.html | work=The New York Times | first=Sanjoy | last=Hazarika | title=India Releases Stinging Report on Gandhi's Death | date=28 March 1989}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ_హత్య" నుండి వెలికితీశారు