ఇందిరా గాంధీ హత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==మరణం==
[[File:IndiraGandhi-SareeAtTimeOfDeath.JPG|200px|thumb|Indira Gandhi's blood-stained saree and her belongings at the time of her assassination, preserved at the Indira Gandhi Memorial Museum in [[New Delhi]].]]
ఆమె కాల్పుల అనంతరం 09:30 కు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్,న్యూఢిల్లీ) కు తరలిఖ్ంపబడ్డారు. అచ్చట వైద్యులు శస్త్రచికిత్స చేసారు. ఆమె మరణించినట్లు 14:20 కు ధృవీకరించారు. డా.టి.డి.డోగ్రా నేతృత్వంలోని వైద్యబృందం ఆమెకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన నివేదిక ప్రకారం 30 బుల్లెట్లు స్టెన్ గన్ మరియు రివాల్వర్ నుండి వెలువడినవి ఆమె శరీరం ద్వారా పోయినట్లు వెల్లడించారు. హంతకులు 33 బుల్లెట్లను ఆమెపై ప్రయోగించారు. వాటిలో 30 ఆమె శరీరంలోనికి ప్రవేశించాయి. వాటిలో 23 ఆమె శరీరం గుండా పోయినవి. ఏడు శరీరంలో ఉండిపోయినవి. డా.డోగ్రా ఏ ఆయుధం నుండి ఏ బుల్లెట్ వెలువడినదో బాలిస్టిక్ పరీక్ష ద్వారా విశదపరిచాడు. ఈ బుల్లెట్లు సంబంధిత ఆయుధాల నుండి వచ్చినట్లు సి.ఎఫ్.ఎస్.ఎల్.ఢిల్లీ వారు గుర్తించారు. అదే విధంగా డోగ్రా కోర్టులో పి.డబ్ల్యూ 5 గా సాక్షిగా హారజయ్యారు. ప్రతివాది తరపున పి.ఎన్ లేఖి అనే న్యాయవాది ఆయనకు క్రాస్ ఎక్జామినేషన్ చేసారు.<ref>{{cite web|title=Dr. Dogra's Expert Evidence in trial of assassination of Late Mrs Indira Gandhi, Prime Minister of India (Witness No. PW 5) |author=Raina Anupuma, Lalwani Sanjeev|journal=Indian Internet Journal of Forensic Medicine & Toxicology|date=2009|volume=7|url=http://www.indianjournals.com/ijor.aspx|publisher=Indianjournals.com|accessdate=2015-03-31}}</ref> ఆమె భౌతిక కాయం నవంబరు 1 న తీన్‌మూర్తి భవన్ కు తరలించబడినది.<ref name=cnn/> ఆమెను నవంబరు 3 న మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్‌ఘాట్ సమీపంలో "శక్తిస్థల్" వద్ద దహనం చేసారు. ఆమె భౌతిక కాయానికి ఆమె కుమారుడు [[రాజీవ్ గాంధీ]] దహన సంస్కారాలు చేసారు.
 
==తదనంతర పరిస్థితి==
మరణించిన తరువాత నాలుగు రోజులు అనేక వేలమంది సిక్కులు ఉద్యమకారుల హింస మూలంగా హతులైనారు.
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ_హత్య" నుండి వెలికితీశారు