1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
== నేపథ్యం ==
[[1973|1973లో]] [[అకాలీ దళ్]] వర్కింగ్ కమిటీ [[ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం|ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని]] ఆమోదించింది. ఈ తీర్మానం భారత ప్రభుత్వాన్ని నిజ సమాఖ్య స్ఫూర్తిపై రాజ్యాంగాన్ని పునర్నిర్మించి రాష్ట్రాల్లో కేంద్ర జోక్యం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, సాధారణ పరిపాలనకు మాత్రమే పరిమితమై, మిగిలిన అంశాలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతోపాటుగా [[హర్యానా]], [[పంజాబ్]]ల ఉమ్మడి రాజధాని [[చండీగఢ్]] ని పూర్తిగా పంజాబ్ కే రాజధానిగా ఇవ్వాలని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిక్ఖులు అధికంగా ఉంటున్న ప్రాంతాలను కూడా పంజాబ్ రాష్ట్రంలో చేర్చాలని అన్నది. వీటన్నిటికీ నేపథ్యంగా సిక్ఖు జాతి ఆశయాలు, ఆశలకు రూపుగా అకాలీదళ్ ను అభివర్ణించుకుని ఖాల్సా శ్రేష్ఠత, సిక్ఖుల ప్రాథమిక హక్కులను సాధించుకోవడం అంటూ తమ లక్ష్యాలను అభివర్ణించుకుంది.<br />
1977లో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] ముగిసిపోయాకా, అకాలీ దళ్ పంజాబ్ లో అధికారం సాధించడంతో పాటుగా ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చి దానికి నదీ జలాల పంపిణీలో పెద్దవాటా, సిక్ఖుల పవిత్ర స్వర్ణదేవాలయం ఉన్న అమృత్ సర్ కు పవిత్ర నగరం అన్న పేరు పెట్టడం వంటి డిమాండ్లు చేర్చారు. క్రమంగా ఈ రాజకీయ వివాదం [[భింద్రన్ వాలే]] ప్రాదుర్భావంతో మరింత వేడెక్కింది.
 
== మూలాలు ==