1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[1977]]లో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] ముగిసిపోయాకా, అకాలీ దళ్ పంజాబ్ లో అధికారం సాధించడంతో పాటుగా ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చి దానికి నదీ జలాల పంపిణీలో పెద్దవాటా, సిక్ఖుల పవిత్ర స్వర్ణదేవాలయం ఉన్న అమృత్ సర్ కు పవిత్ర నగరం అన్న పేరు పెట్టడం వంటి డిమాండ్లు చేర్చారు. క్రమంగా ఈ రాజకీయ వివాదం [[భింద్రన్ వాలే]] ప్రాదుర్భావంతో మరింత వేడెక్కింది. అకాలీ దళ్ ను రాజకీయంగా వెనక్కినెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తెరపైకి తెచ్చారని కొందరు చరిత్రకారులు భావించే భింద్రన్ వాలే సంవత్సరాల కాలంలో అనూహ్యమైన రాజకీయ వృద్ధి సాధించారు. సిక్ఖుల్లో కొన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించిన భింద్రన్ వాలే ఉద్యమాన్ని తీవ్రవాదం వైపు నడిపారు, సిక్ఖులకు విడిగా [[ఖలిస్తాన్]] అనే దేశం ఏర్పడాలన్న [[ఖలిస్తాన్ ఉద్యమం|వేర్పాటు ఉద్యమాన్ని]] లేవదీశారు.<br />
మరోవైపు [[1981]] ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అకాలీ దళ్ ప్రతిఘటన మార్గాన్ని పట్టుకుని, వారి నాయకుడు సంత్ హర్ చరణ్ సింగ్ లోంగోవాల్ స్వర్ణదేవాలయంలోని ఓ భాగంలో చేరారు. అక్కడి నుంచి వీధుల్లో ఆందోళనలు, నిరసనలు చేయాలన్న పిలుపునిస్తూ వచ్చారు. మరోవైపు భింద్రన్ వాలే అదే ఆలయంలోని మరోభాగం నుంచి పనిచేసేవారు. ఆయన విధానం మిలిటెన్సీ పద్ధతిలో ఉండేది. [[1980]]ల ఏప్రిల్లో సిక్ఖు నిరంకారీ శాఖ నాయకుడు బాబా గురుచరణ్ సింగ్ ఢిల్లీలో హత్యకు గురికావడం, [[1981]]లో సిక్ఖు తీవ్రవాదం పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పత్రికా సంపాదకుడు లాలా జగత్ నారాయణ్ హత్య కావడం వంటివి జరిగాయి. ఈ హత్యల వెనుక ఉన్న భింద్రన్ వాలేపై అరెస్టు వారెంట్ జారీ కాగా అతను మత పాఠశాల రక్షణలోకి వెళ్ళిపోయారు. తాను ఎన్నుకున్న సమయంలో తానే వచ్చి లొంగిపోతానని, ఐతే తనను అరెస్టు చేసేందుకు సంప్రదాయ సిక్ఖు పోలీసు అధికారులే రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ అవమానకరమైన షరతులకు తలవొగ్గి ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. మూడు వారాల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాకా మరిన్ని హింసాత్మక పరిణామాలు సాగాయి.<br />
[[అక్టోబర్ 5]], [[1983]]న సిక్ఖు తీవ్రవాదులు బస్సును ఆపి ఆరుగురు హిందువులను వేరుచేసి కాల్చి చంపారు. అప్పటికి ఉద్యమంలో హింసాత్మకంగా చనిపోయినవారి సంఖ్య 175కు చేరుకుంది. తర్వాతి రోజున [[అక్టోబర్ 6]], [[1983]]న పంజాబ్ లో ప్రభుత్వాన్ని రద్దుచేసి [[రాష్ట్రపతి పాలన]] విధించారు. బాంబుదాడులు, ప్రయాణికుల్లో హిందువులను వేరుచేసి కాల్చి చంపడం వంటి ఘటనలు కొనసాగాయి.
 
== మూలాలు ==