"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:ఉద్యమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (వర్గం:ఉద్యమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు''' ఉద్యమం [[విశాఖపట్టణం]]లో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా 23మంది ప్రాణాలర్పించారు. 1971లో నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] [[విశాఖ ఉక్కు కర్మాగారం|విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి]] శంకుస్థాపన చేసింది. 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురుకావడం, ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని [[పి.వి.నరసింహారావు]] విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది. ఈ సందర్భంగా ఉక్కుకార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉక్కువడ్డీలను ఈక్విటీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడింది. త్వరలోనే ఈ కర్మాగారం మినిరత్న నుంచి నవరత్న స్థాయికి చేరుకుంది. <ref>{{cite news|last1=Andhra|first1=Voice|title=andhravoice|url=http://www.andhravoice.net/newsDetails.php?id=28970|accessdate=5 May 2016|agency=Andhravoice|publisher=Andhravoice}}</ref>
== మూలాలు ==
 
[[వర్గం:ఉద్యమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1873821" నుండి వెలికితీశారు